అసెంబ్లీలోకి బ్యాక్ గేట్ నుంచి వెళ్లిన వైఎస్ జగన్, ఆ రోజు హుందాగా మెయిన్ గేట్ లో, ఈ రోజు!
ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేది. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ ఆ రోజు మాజీ సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మొదలైన మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు.
ప్రోటం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో సహ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఇంతకాలం సీఎం హోదాలో ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు లేకుండా పోలీసు అధికారుల కాన్వాయ్ తో అసెంబ్లీలోకి అడుగుపెట్టి దర్జాగా వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ చీఫ్ వైఎస్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కూడా శుక్రవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.

అయితే ఇక్కడే చిన్న లాజిక్ ఉంది. ఇంతకాలం అసెంబ్లీ మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం వైఎస్. జగన్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి వెలుతున్న సమయంలో గేర్ మార్చారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముందు గేటు నుంచి కాకుండా అసెంబ్లీలోకి వెనుక గేట్ లో నుంచి లోపలికి వెళ్లిన వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెంటనే అసెంబ్లీలో నుంచి బయటకు వెళ్లిపోయారు.
గతంలో వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చేవారు అయితే అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించిన మాజీ సీఎం వైఎస్ జగన్ వేరే మార్గంలో వెనుక గేటు నుంచి అసెంబ్లీకిలోకి వచ్చారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకాలం వైఎస్ జగన్ ను ఆపేవాడులేకపోవడంతో ఆయన ముందుగేటు నుంచి భారీ బందోబస్తు మధ్య అసెంబ్లీకి వచ్చేవారు.
అయితే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా లేకపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతితో కారులో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎన్డీఏ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటా వైఎస్ జగన్ కూడా సాదారణ ఎమ్మెల్యేగా గేటు బయట కారు నిలిపి నడుచుకుంటూ అసెంబ్లీలోకి అడుగుపెట్టాల్సి ఉంది. అయితే సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ కు గౌరవం ఇవ్వండి అని చెప్పడం వలనే ఆయన కారును అసెంబ్లీ లోపలికి అనుమతి ఇచ్చామని మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications