టీడీపీకి తోక పార్టీలా మారిన ఏపీ బీజేపీ: సీనియర్ నేత ఫైర్
TDP Janasena BJP alliance: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారు చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనిపై ఏపీ బీజేపీ నాయకులు భగ్గుమంటోన్నారు.
టీడీపీలో టికెట్ రాని ఆ పార్టీ నాయకులందరూ కూడా బీజేపీ, జనసేన కండువాలను కప్పుకొంటోన్నారు. ఆయా పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిల్చోంటోన్నారు. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్, భీమవరం నుంచి రామాంజనేయులు, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్, పాలకొండ నుంచి నిమ్మక జయకృష్ణ.. ఇలా పలువరు నాయకులు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థులుగా పోటీ చేస్తోన్నారు.

ఇదే పరిస్థితి ఏపీ బీజేపీలో కూడా తలెత్తింది. అనపర్తి నుంచి తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ఖరారయింది. ఇలా టీడీపీకి చెందిన నాయకులకు బీజేపీ, జనసేన నుంచి టికెట్ లభిస్తోండటం పట్ల ఆ రెండు పార్టీల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది.
దీనిపై ఏపీ బీజేపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. పార్టీ వైఖరి, తీసుకుంటోన్న నిర్ణయాలు, సీట్లు- అభ్యర్థుల ఎంపికను తప్పుపట్టారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఏపీ బీజేపీ మనుగడ సాగించలేదని తేల్చి చెప్పారు.
ఏపీలో బీజేపీ దిశ దశ లేకుండా సాగుతోందనడానికి అనపర్తి బీజేపీ అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎంపిక ఇంకొక ఉదాహరణగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పాలనపై ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని, అక్కడే బీజేపీకి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

సీట్ల పంపకాల్లో మాత్రం టీడీపీ ఇచ్చినవి-బీజేపీ తీసుకున్నవి ఎక్కువ గ్రామీణ ప్రాంతాలకు చెందిన నియోజకవర్గాలేనని ఐవైఆర్ కృష్ణారావు గుర్తు చేశారు. ఆ తీసుకున్న మూడు నాలుగు పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో విజయవాడ పశ్చిమంలో ముస్లిం మెజారిటీ ప్రాంతం అని గుర్తు చేశారు.
ఏ ప్రాతిపదికన ఈ సీట్లను తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఇచ్చింది- వాటిని బీజేపీ తీసుకుందో అర్థం కావట్లేదని ఐవైఆర్ అన్నారు. కొంతమంది అభ్యర్థులను ముందే బీజేపీ నిర్ణయించి ఉంటే వాళ్లకు కలిసివచ్చే నియోజకవర్గాలను టీడీపీ వద్ద గట్టిగా అడిగి తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
అలాకాకుండా టీడీపీ ఇచ్చిన నియోజకవర్గాల్లో తాము నిర్ణయించిన అభ్యర్థులను సర్దుబాటు చేసే ప్రయత్నానికి పాల్పడటం వల్లే ఈ తంటలు వచ్చిపడ్డాయని పేర్కొన్నారు. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిని పార్టీలో చేర్చుకొని అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం అనేది ఏపీలో బీజేపీ మనుగడనే ప్రశ్నించే చర్యగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకవేళ కావాలనుకుంటే ఆ సీటును టీడీపీకి వదిలి రాజమండ్రి అర్బన్ తీసుకొని సోము వీర్రాజుతో పోటీ చేయించ ఉండొచ్చని ఐవైఆర్ వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతోనే బీజేపీ అలా చేయలేదని అన్నారు. టీడీపీకి ఇబ్బంది పడకుండా బీజేపీ రాజకీయాలు సాగాలనుకోవడం సరికాదని అన్నారు. తెలుగుదేశానికి తోకలా ఉన్న బీజేపీ భవిష్యత్తులో అదే పార్టీలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఐవైఆర్ చెప్పారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications