మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా- నిజమేనంటూ వీడియో రిలీజ్-భయపడొద్దంటూ భరోసా...
బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు తాజాగా కరోనా సోకింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం ఎమ్మెల్యేగా పనిచేసిన మాణిక్యాలరావు పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయనకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. మాణిక్యాలరావుకు కరోనా సోకిందన్న విషయం తెలిసి ఆందోళన చెందుతున్న అభిమానులకు ఆయన వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఇటీవలే తన మిత్రుడు, తాడేపల్లి గూడెం మన్సిపాలిటీ మాజీ ఛైర్మన్ కు కరోనా వచ్చిందని, విషయం తెలియక తాను ఆయనతో పాటు కారులో ప్రయాణించడం వల్ల కరోనా సోకి ఉండొచ్చని మాణిక్యాలరావు తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. కారులో ప్రయాణించిన తర్వాత కరోనా పరీక్ష చేయించుకుంటే ఈ విషయం బయటపడిందన్నారు.

Recommended Video
అయితే కరోనా సోకిందని భయపడాల్సిన అవసరం లేదని, వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుందన్నారు. ప్రజల్లో కరోనా కారణంగా ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే అయినా ప్రభుత్వం నిర్దేశించిన విధంగా చికిత్స తీసుకుని భయాందోళలను తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన సందేశంలో పేర్కొన్నారు.
మాజీ మంత్రి మాణిక్యాలరావుకు కరోనా#Bjp #coronavirus #Manikyalarao pic.twitter.com/yPeRC6VJQe
— oneindiatelugu (@oneindiatelugu) July 4, 2020












Click it and Unblock the Notifications