కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ .. ఎందుకో తెలుసా !!
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కౌలు రైతుగా మారారు. ఉగాది పండుగను పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో దుక్కి దున్ని ఆయన ఏరువాక ప్రారంభించారు. తాను కౌలుకు తీసుకున్న పది ఎకరాల పొలంలో ఆయన తన వ్యవసాయ పనులను మొదలు పెట్టారు. తెలుగువారి తొలి పండగ ఉగాది రోజున కౌలు రైతు గా వ్యవసాయాన్ని మొదలుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక పెద్ద కారణమే ఉంది.

కౌలు రైతుల సాధకబాధకాలను తెలుసుకోవడం కోసం లక్ష్మీ నారాయణ నిర్ణయం
కౌలు రైతుల సాధకబాధకాలను తెలుసుకోవడం కోసం, వారి కష్ట నష్టాలను అర్థం చేసుకోవడం కోసం తాను కూడా కౌలు రైతుగా మారానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వివరించారు. కౌలు రైతుల కోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి . కౌలు వ్యవసాయ లాభసాటిగా ఉండేందుకు రైతులు అనుసరించాల్సిన విధానాలు ఏంటి వంటి అనేక విషయాలను అర్థం చేసుకొని ప్రయోగాత్మకంగా వ్యవసాయం చేయడానికి తాను కౌలు రైతు గా మారానని లక్ష్మీనారాయణ వెల్లడించారు .

ధర్మవరంలో 10 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం మొదలెట్టిన సీబీఐ మాజీ జేడీ
ఏపీలో కౌలు రైతులు స్థితిగతులు తెలుసుకునేందుకు మెట్ట ప్రాంతంలో స్వయంగా తానే కౌలుకు వ్యవసాయం చేస్తున్నట్లు సీబీఐ మాజీ జె.డి లక్ష్మీనారాయణ వివరించారు. ధర్మవరం గ్రామానికి చెందిన చెక్కపల్లి సత్యబాబు అనే రైతు వద్ద పది ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నానని పేర్కొన్న లక్ష్మీనారాయణ నిర్ణయం పట్ల ఆ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
సీబీఐ మాజీ జేడీ గా ఉద్యోగ విరమణ చేసిన అప్పటి నుంచి రైతు సమస్యలపై అధ్యయనం చేస్తున్న లక్ష్మీనారాయణ ఇప్పటికే వేలాది మంది కౌలు రైతులను కలిసి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

రాజకీయాల్లో రాణించాలని ఎన్నికల్లో పోటీ చేసి ఓడినా , ప్రజా క్షేత్రంలోనే ఉంటున్న లక్ష్మీ నారాయణ
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను, రాష్ట్రంలోని వ్యవసాయ పరిస్థితులను అధ్యయనం చేశారు. ఇక ఇప్పుడు కౌలురైతు గా మారి కౌలు రైతుల కష్టాలను తెలుసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నారు. ఏదేమయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను క్రియాశీల భూమిక పోషించాలని గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తున్న సి.బి.ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఎన్నికల్లో ఎంపీగా జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి పాలైన ప్పటికీ , ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల కోసం పని చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అన్నదాతల కష్టాలు తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications