RRR: సుప్రీం కోర్టు ఆదేశాలతో సీఐడీ మాజీ ఏఎస్పీ ప్రత్యక్షం
వైసీపీ ప్రభుత్వం హయాంలో అదే పార్టీ ఎంపీ అయిన తనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ ప్రస్తుత ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు గుంటూరు జిల్లాలో పోలీసు అధికారుల మీద కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ విభాగం రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పోలీసు అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు.
కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న విజయ్ పాల్ ఎట్టకేలకు పోలీసు అధికారులు ముందు హాజరు కావడంతో ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసు ఊహించని మలుపు తిరిగింది. సీఐడీ విభాగం మాజీ అధికారి విజయ్ పాల్ తో పాటు మరి కొందరు పోలీసు అధికారులు తనను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి చిత్రహింసల గురి చేశారని, తాను అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారని రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిబంధనలకు విరుద్ధంగా తనను అనేక ఇబ్బందులకు గురి చేసిన సీఐడీ మాజీ అధికారులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ తో పాటు మరి కొందరు పోలీసు అధికారుల పైన టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసు పెట్టారు. కేసు నమోదు అయిన వెంటనే సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ పారిపోయారు.
తర్వాత ముందస్తు బెయిల్ ఇవ్వాలని విజయ్ పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయన బెయిల్ పిటీషన్ ను కొట్టేసింది. ఆతర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విజయ్ పాల్ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. ఇటీవల విజయ్ కాల్ బెయిల్ పిటిషన్ విచారణ చేసిన సుప్రీం కోర్టు తొందరపడి విజయ్ పాల్ ను అరెస్టు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సూచించింది.
అయితే ఈ కేసులో పోలీసుల ముందు విచారణకు కచ్చితంగా సహకరించాలని ఇదే సమయంలో సుప్రీం కోర్టు విజయ్ పాల్ కు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరు జిల్లా పోలీసు అధికారుల ముందు విజయ్ పాల్ విచారణకు హాజరయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కేసులో ఎట్టకేలకు విజయ్ పాల్ పోలీసుల ముందు ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఆయన్ను విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications