మాజీ సీఎం రీఎంట్రీ, పెద్దిరెడ్డి ఇలాకాలో? చంద్రబాబుకు రాజకీయ జన్మ ఇచ్చిన ఫ్యామిలీలో!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరు అసెంబ్లీ నియోజక వర్గం అంటే మొదట టక్కున చెప్పే పేరు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. పీలేరులో చక్రం తిప్పిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నియోజక వర్గాల విభజన అయిన తరువాత పుంగనూరు వెళ్లి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పీలేరు అసెంబ్లీ నియోజక వర్గం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. మాజీ సీఎం రీ ఎంట్రీతో పీలేరు రాజకీయాలు వేడెక్కాయి.

పీలేరులో నల్లారి ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. వాయల్పాడు నియోజక వర్గం (ప్రస్తుతం వాల్మీకిపురం), పీలేరులో కలిసిపోయింది. గతంలో పీలేరు నియోజక వర్గం నుంచి నల్లారి అమరనాథ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి పీవీ నరసింహారావు క్యాబినేట్ లో మంత్రిగా పని చేశారు. నారా చంద్రబాబు నాయుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది ఇదే నల్లారి అమరనాథ రెడ్డి అని చాలా మందికి తెలీదు.

Former CM Nallari Kiran Kumar Reddy is running in Peeleru constituency

అలాంటి నల్లారి ఫ్యామిలీకి చెందిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్ విప్ గా, స్పీకర్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేశారు. నల్లారి అమరనాథ్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి లాంటి హేమాహేమీలు ఈ నియోజక వర్గం పరిధిలోనే రాజకీయంగా చక్రం తిప్పారు.

పీలేరు అసెంబ్లీ నియోజక వర్గంలో పరిధిలో పీలేరు, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, కంభంవారి పల్లె మండలాలు ఉన్నాయి. శెట్టి బలిజ, రెడ్డి, ముస్లీం సామాజీక వర్గాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గం నుంచి ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేలు అయ్యారు. ఏడు సార్లు కాంగ్రెస్, మూడుసార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇక్కడ చక్రం తిప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు ఇంతకాలం దూరం కావడంతో ఆయన తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు.

పీలేరు నుంచి రెండు సార్లు వైసీపీకి చెందిన చింతల రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. మరోసారి జగన్ అదే చింతల రామచంద్రా రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. ఇప్పుడు 10 ఏళ్లుగా అధికారానికి దూరం అయిన నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి మీద సానుభూతి ఎక్కువ కావడం, ఇదే సమయంలో బీజేపీలో చేరి రాజంపేట ఎంపీగా పోటీ చేస్తున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పీలేరు నియోజక వర్గంలో రాజకీయాలు వేడెక్కాయి.

వైసీపీ మీద, చింతల రామచంద్రా రెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువ కావడంతో దానిని తమవైపు తిప్పుకోవడానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కలికిరిలోని సొంత గ్రామంలోనే మకాం వేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన తమ్ముడు నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నారు. పీలేరులో ఎలాగైనా తెలుగుదేశం జెండా ఎగరవేయాలని నల్లారి ఫ్యామిలీ ప్రయత్నిస్తున్నది.

పీలేరులో బలిజ కులస్తుల ఓట్లు ఎక్కువగా ఉండటం, టీడీపీకి జనసేన మద్దతు ప్రకటించడంతో ఆ ఓట్లు టీడీపీకి పడుతాయని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద పీలేరులో ఎన్నడూ లేని విధంగా రాజకీయం వేడెక్కింది. జనసేన నాయకులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీకి సంపూరణ మద్దతు ప్రకటించి ఆ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పీలేరు నియోజక వర్గం మీద పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పీలేరులో ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+