మాజీ గవర్నర్, ఆర్మీ చీఫ్ కేవీ కృష్ణారావు కన్నుమూత: గవర్నర్ సంతాపం
మాజీ గవర్నర్, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కొటికలపూడి వెంకట కృష్ణారావు (93) శనివారం తుదిశ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. గతంలో ఆయన జమ్మూ కశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్‌గా ఆయన పనిచేశారు.
జులై 11, 1989 నుంచి జనవరి 19, 1990 వరకు తొలిసారి జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ రెండోసారి మార్చి 13, 1993, నుంచి 1998 వరకు గవర్నర్‌గా సేవలందించారు. కేవీ కృష్ణారావు 1923లో విజయవాడలో జన్మించారు. 1942 నుంచి 1983 వరకు ఇండియన్ ఆర్మీలో ఆయన సేవలందించారు.
బ్రిటిష్ ఇండియా ఆర్మీ, ఇండియన్ ఆర్మీలో పనిచేసిన ఆయన యువ ఆఫీసర్‌గా బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్‌లో సేవలందించారు. ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు విశిష్ట సేవా మెడల్ ఇచ్చి సత్కరించింది. భారత ఆర్మీకి 14వ ఛీఫ్‌గా కృష్ణారావు పనిచేశారు.

భద్రతా అంశాలపై 'ప్రిపేర్ ఆర్ పెరిష్', ఆర్మీలో తన సేవలను గుర్తు చేసుకుంటూ 'ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్' అనే పుస్తకాలను ఆయన రాశారు. 1983లో ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, అగర్తల రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు.
కేవీ కృష్ణారావుకు ఒక భార్య రాధా రావు కాగా, ఇద్దరు పిల్లలు. కుమారుడు నారాయణ్, కూతురు లలిత. 1949-51లో భారత్ స్థాపించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్థాపక శిక్షకుడుగా వ్యవహరించారు. కేవీ కృష్ణారావు మృతి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్ తన సంతాపాన్ని తెలిపారు.












Click it and Unblock the Notifications