రాయపాటి రాయబారం, టిడిపిలో చేరిన డొక్కా, పెద్ద వార్తేమీ కాదని రఘువీరా
విజయవాడ: గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో డొక్కా టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.
నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు, ఎమ్మెల్యే ఆంజనేయులు, పలువురు టిడిపి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ రాయపాటి, మిత్రుల సలహా మేరకు తాను టిడిపిలో చేరినట్లు డొక్కా తెలిపారు.

రాయపాటీ కీలక పాత్ర
డొక్కా టిడిపిలో చేరడం వెనుక రాయపాటి కీలక పాత్ర పోషించారు. తన రాజకీయ నిర్ణయాలు అన్ని రాయపాటి సూచన మేరకు డొక్కా తీసుకుంటారు. ఇటీవల, డొక్కా వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, రాయపాటి చొరవ తీసుకొని ఆయన టిడిపి వైపు మళ్లించారని తెలుస్తోంది.


అది పెద్ద వార్తేమీ కాదు: రఘువీరా రెడ్డి
డొక్కా మాణిక్య వరప్రసాద్ టిడిపిలో చేరడంపై ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి స్పందించారు. డొక్కా టీడీపీలో చేరిన విషయమేమీ పెద్ద వార్త కాదన్నారు. చాలాకాలం నుంచి డొక్కా తమ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications