జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అధికారం లేకపోతే ఇలాగేనా ?
జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ నేరాలు జరిగాయని, ఆ సమయంలో జరిగిన సంఘటనలపై వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని, వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఒకలాగా, అధికారంలోని సమయంలో మరో లాగా డ్రామాలాడుతున్నారని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ అరాచకాలు జరిగాయని పీతల సుజాత ఆరోపించారు.
అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పీతల సుజాత మాజీ సీఎం జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. జగన్ ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నారని, ఆ సందర్భంలోనే రాష్ట్రంలో ఎక్కువ అరాచకాలుల జరిగాయని పీతల సుజాత ఆరోపించారు. ఆడ బిడ్డలపై అత్యాచారాలు, దాడులకు డ్రగ్స్, గంజాయి కారణమని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో, జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో ఆడపిల్లలపై అత్యాచారం జరిగినప్పుడు వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదని పీతల సుజాత ప్రశ్నించారు.

ఇలాంటి విషయాలు జగన్ కు గుర్తు లేదా అని పీతల సుజాత ప్రశ్నించారు. నెల్లూరులో హరిప్రసాద్, కాకినాడలో దుర్గాప్రసాద్ హత్యకు గురైనప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదని, ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదని, తాడేపల్లి ప్యాలెస్ నుండి బయటకు రాలేదని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగినా ఆ పార్టీ నాయకులు కనీసం స్పందించలేదని, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులపైన, ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని పీతల సుజాత మండిపడ్డారు.
జగన్ పాలనలో హత్యకు గురైన బాధితులు, లైంగిక దాడులకు గురైన ఆడబిడ్డలకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సహాయం చేసిందని, వారికి అండగా నిలిచిందని పీతల సుజాత గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో దిశ యాప్ లేకపోవడం వలనే ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పీతల సుజాత మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో దిశ యాప్ ఉండేదని, అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగలేదా అని పీతల సుజాత వైసీపీ నాయకులను ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు కొందరు వైసీపీ కార్యకర్తలు కారణమని, ఆ విషయం స్పష్టంగా వెలుగు చూస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత సంచలన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications