పెత్తందారీ చంద్రబాబు ! శల్యసారథి పవన్ ! పేర్నినాని తీవ్ర విమర్శలు..

తోడబుట్టిన చిరంజీవిని తలదించుకునేలా చేసిన పవన్ కళ్యాణ్ నుంచి కుటుంబ సంబంధాల గురించి నేర్చుకోవడం హాస్యాస్పదంగా ఉందని వైసీపీ మాజీ మంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు. జనసైకోలు చిరంజీవిని దూషించినప్పుడు పవన్ కల్యాణ్ నోరు ఏమైందని ఆయన ప్రశ్నించారు. తన తల్లిని దూషిస్తారా అని టీడీపీని, లోకేష్ ను, చంద్రబాబుపై గతంలో పవన్ కల్యాణ్ రంకెలేశారని, బంధాలకు విలువిచ్చేవాడవైతే తల్లిని తిట్టిన వాడిని ఏం చేస్తారని అడిగారు. పవన్ కల్యాణ్ తల్లిని తిట్టినవారి పల్లకి మోస్తున్నారని పేర్ని విమర్శించారు.

తాను సీఎం కాలేనని, ఎమ్మెల్యే కాలేనని.. కానీ మీరు ఆగండంటూ పవన్ కళ్యాణ్ జనసైనికులకు శల్యసారథ్యం చేస్తున్నాడని పేర్ని నాని విమర్శించారు. మీరు శల్యుడు కాబట్టే జగన్ అర్జునుడు అంటే బాధ కలిగి మాట్లాడుతున్నావని పేర్ని ఆరోపించారు.గతంలో చంద్రబాబు మనకొద్దని చెప్పి పంపేస్తే బందరు ఎంపీ బాలశౌరి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఛీకొట్టారని, చివరికి చిరంజీవి సాయంతో జనసేనలో చేరారని పేర్ని ఆరోపించారు. పవన్ కల్యాణ్ కు బాలశౌరి నిజస్వరూపం త్వరలోనే తెలుస్తుందన్నారు.

former minister perni nani strong counter to pawan kalyan, chandrababu remarks on ysrcp

మరోవైపు తమ కార్యకర్తలకు భోజనం పెడితే సర్వర్ ఉద్యోగం అంటూ చంద్రబాబు చేసిన విమర్శలు ఆయన పెత్తందారీ మనస్తత్వానికి నిదర్శనం అని పేర్ని నాని విమర్శించారు. వాళ్లు మనుషులు కాదా? వారికి కుటుంబాలు లేవా? వారికి వ్యక్తిత్తం లేదా? ఒళ్ళు వంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? పెత్తందారీ మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, కులహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు, పవన్ వంటి పెత్తందారీ నేతల్ని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని జగన్ పిలుపునిస్తున్నారని పేర్ని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+