జాషువా జయంతి సభలో మాజీ మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు
గుంటూరు: గుర్రం జాషువా జయంతి ఉత్సవాల్లో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జాషువా తండ్రి యాదవ, తల్లి మాదిగ అని ఆయన వెల్లడించారు.మాదిగల మాదిరిగా యాదవులు స్పందించడం లేదని ఆయన అన్నారు.
కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జాషువా పోరాడారని ఆయన వివరించారు. ట్యాంక్‌బండ్‌పై జాషువా విగ్రహాన్ని పడగొట్టకుండా అడ్డుకున్న..మాదిగ సోదరులను ప్రత్యేకంగా సన్మానించానని ఆయన గుర్తు చేసుకొన్నారు.

మంత్రిగా ఉన్న సమయంలో ఆయన చేసిన కామెంట్స్ వివాదాలకు దారితీశాయి. రావెల కిషోర్‌బాబును మంత్రివర్గం నుండి తప్పించి ఆయన స్థానంలో నక్కా ఆనంద్‌బాబును చంద్రబాబునాయుడు నియమించారు.. రావెల కిషోర్‌బాబు మంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ చీఫ్ జగన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..
ఇటీవల గుంటూరులో మాదిగల సభ సమయంలో కూడ ఈ సభకు తరలిరావాలని రావెల కిషోర్‌బాబు పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు అప్పుడు సంచలనం సృష్టించాయి.












Click it and Unblock the Notifications