చంద్రబాబు చెప్పే రూల్ ఆఫ్ లా ఇదేనా:. భగ్గుమన్న రోజా
మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆర్కే రోజా చంద్రబాబు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసిపి నాయకులు తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చెబుతున్న రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా? రోజా
వైసిపి నాయకులు పైన దాడులు చేయడం, పార్టీ కార్యాలయాలను టార్గెట్ గా చేసుకోవడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం కొనసాగుతోందని మాజీ మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు చట్టబద్ధమైన పాలన గురించి చాలా మాటలు చెబుతారని, ముఖ్యమంత్రి చెబుతున్న రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా అంటూ ఆమె చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.

ప్రభుత్వమే ఈ పరిస్థితులకు బాధ్యత వహించాలి
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఈ పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జరుపుతున్న దాడులలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకుల నివాసాలు లక్ష్యం అయ్యాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని తోపాటు, వల్లభనేని వంశీ, ముద్రగడ పద్మనాభం వంటి నేతల ఇళ్లను ధ్వంసం చేసినట్టు రోజా పేర్కొన్నారు.
తనపైన కూడా దుర్భాషలు
హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మార్గాని భరత్ కార్యాలయాలపై కూడా దాడి చేశారని రోజా మండిపడ్డారు. అంతేకాదు దేవినేని అవినాష్, విడదల రజినిపైన కూడా దాడికి ప్రయత్నం చేశారని పేర్కొన్న రోజా, మీడియా సంస్థల పైన కూడా దాడులు జరిగాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. తనపై కూడా కొంతమంది దుర్భాషలు ఆడేలా ప్రోత్సహిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయటం ప్రజాస్వామ్యానికి అపహాస్యం
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష నేతలను ఈ విధంగా టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి అపహాస్యం అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దాడులు అన్నిటికీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, దీనిపైన చంద్రబాబు స్పందించాలని, తక్షణం చర్యలు చేపట్టాలని అన్నారు రోజా.












Click it and Unblock the Notifications