ఎందరు రజినీకాంత్ లు వచ్చి చెప్పినా ప్రజలు చంద్రబాబును ఆదరించరు: మాజీమంత్రి వెల్లంపల్లి

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న ఏపీకి వచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్ పోరంకి లోని అనుమోలు గార్డెన్స్ లో జరిగిన వేడుకలలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ, చంద్రబాబుతో తన స్నేహబంధాన్ని గురించి ప్రస్తావించారు. చంద్రబాబు గొప్ప విజనరీ ఉన్న నాయకుడని, చంద్రబాబు విజన్ వల్లే హైదరాబాద్ న్యూయార్క్ సిటీలా అభివృద్ధి చెందిందని రజినీకాంత్ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబును రజినీకాంత్ పొగడడం పై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రజినీకాంత్ పై ఫైర్ అయ్యారు. రజినీకాంత్ సినిమాలలో సూపర్ స్టార్ కానీ రాజకీయాలలో ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎంత మంది రజినీకాంత్ లు వచ్చి చెప్పినా చంద్రబాబును ప్రజలు ఆదరించే పరిస్థితి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

 vellampalli

సొంతంగా గెలిచే సత్తా లేక చంద్రబాబు రజినీకాంత్, బాలకృష్ణ, గరుడ శివాజీ వంటివారిని తెర మీదకు తీసుకు వస్తున్నారని వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని పేర్కొన్న వెల్లంపల్లి మరోమారు వైయస్ జగనే సీఎం అవుతారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు రజినీకాంత్ కు ఏపీ రాజకీయాలపై అవగాహన లేదని మండిపడ్డారు.

చంద్రబాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో, చంద్రబాబుకు రజినీకాంత్ కూడా సహకరించారని విమర్శించారు. ఇక అటువంటి వ్యక్తి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించడం ఏమిటని ప్రశ్నించారు. ఇక చంద్రబాబు విజన్ 2047 ఏమిటో అర్థం కాలేదని పేర్కొన్నారు. రజినీకాంత్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. చంద్రబాబు సినిమా యాక్టర్లను తీసుకువచ్చి, స్క్రిప్ట్ లు ఇచ్చి వారితో చదివిస్తారు అని ఎద్దేవా చేశారు.

 vellampalli

గత ఎన్నికల సమయంలో కూడా గరుడ శివాజీ వచ్చి హడావిడి చేశాడని గుర్తు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలకు రాజకీయాలపై అవగాహన ఉండటం వల్లే గత ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పారన్నారు. కేవలం 23 స్థానాలకే చంద్రబాబును పరిమితం చేసి వైసిపి కి అధికారం కట్టబెట్టారని వ్యాఖ్యలు చేశారు వెల్లంపల్లి శ్రీనివాస్.

అంతేకాదు వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని, చంద్రబాబు అలా పోటీ చేయగలరా చెప్పాలన్నారు. గతంలో నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా తిట్టిన చంద్రబాబు విజన్ ఇప్పుడు మారిపోయిందా అంటూ సెటైర్లు వేశారు. మొత్తానికి టీడీపీ అధినేత చంద్రబాబు ని పొగిడినందుకు వైసీపీ నేతలు రజనీకాంత్ ను టార్గెట్ చేసే విమర్శలు గుప్పిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+