లాఠీ చార్జ్ పిరికిపంద చర్య; రైతులు చిందించిన రక్తానికి మూల్యం చెల్లించక తప్పదు: మాజీ మంత్రులు

రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్ర గత 10 రోజులుగా సజావుగానే జరిగింది. మధ్య మధ్య పోలీసులు ఆంక్షలతో ఇబ్బంది పెట్టినా సరే రైతులు తమ మహా పాదయాత్రను కొనసాగించారు. అయితే గురువారం ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మహా పాదయాత్రలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి స్థానికులు రైతులను కలవకుండా అడ్డుకోవటంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాగ్వాదానికి దిగిన రైతులు, స్థానికుల తీరుతో పోలీసులు రైతులపై లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒక రైతు చెయ్యి విరిగింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు టీడీపీ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు.

 పోలీసుల అండతోనే రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు : మాజీ మంత్రి చినరాజప్ప

పోలీసుల అండతోనే రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు : మాజీ మంత్రి చినరాజప్ప

పోలీసుల అండతో రైతులపై ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది అని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద మహా పాదయాత్ర చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేయడాన్ని ఆయన ఖండించారు. హౌస్ అరెస్టులతో అమరావతి రైతుల మహా పాదయాత్రను అడ్డుకోలేరని పేర్కొన్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతుల పై లాఠీఛార్జ్ చేయడం దారుణమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల మహా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని, భయపెట్టాలని చూసినా రైతుల మహాపాదయాత్ర ఆగదని నిమ్మకాయల చినరాజప్ప స్పష్టంచేశారు.

 మహా పాదయాత్ర జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది

మహా పాదయాత్ర జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది

మహా పాదయాత్ర జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది అని అభిప్రాయపడ్డారు. పాదయాత్రకు హైకోర్టు అనుమతులు ఉన్నాయని పేర్కొన్న చినరాజప్ప, కోర్టు ధిక్కరణకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయపడిన రైతులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉక్కు సంకల్పంతో ముందుకు సాగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందని టీడీపీ నేతలు చెప్తున్నారు.

 అమరావతి రైతులపై లాఠీ చార్జ్ పిరికిపంద చర్య : దేవినేని ఉమా

అమరావతి రైతులపై లాఠీ చార్జ్ పిరికిపంద చర్య : దేవినేని ఉమా

అమరావతి రైతులపై లాఠీఛార్జ్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని మాజీ మంత్రి దేవినేని ఉమా పోలీసుల లాఠీ చార్జ్ ను ఖండించారు. తెదేపాఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, ఏలూరి సాంబ శివరావుల హౌస్ అరెస్టు దుర్మార్గం అని పేర్కొన్నారు. పాదయాత్రను చూపించొద్దంటూ మీడియాపై ఆంక్షలా? కేసులు,దాడులతో రైతుల సంకల్పాన్ని ఆపలేరు. రైతులు చిందించిన రక్తానికి మూల్యం చెల్లించక తప్పదు వైఎస్ జగన్ అంటూ దేవినేని విరుచుకుపడ్డారు.

రాజధానికి భూములిచ్చిన రైతుల గొంతు కోసిన వైసీపీ సర్కార్

వైసీపీ ప్రభుత్వం పాదయాత్రలో సామాన్య ప్రజానీకం పాల్గొనకుండా పోలీసు వాహనాలతో రోడ్లను దిగ్బంధం చేయడం, పాదయాత్రలో పాల్గొనబోయే ప్రజలపై లాఠీ చార్జీ చేయడం ఎంతవరకు సమంజసం ? అంటూ ప్రశ్నించారు. ఇదేనా పోలీసు చట్టాలలో ఉండేది? ఇలాగే పోలీసులు వ్యవహరించమని కోర్టు చెప్పిందా? అంటూ టీడీపీ నేతలు నిలదీశారు. అంతేకాదు రాజధానికి భూములు ఇచ్చిన రైతులను వైసీపీ నమ్మించి గొంతుకోయడమే కాకుండా అమరావతి రాజధాని సాధన కోసం అమరావతి రైతులు శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రను జగన్ రెడ్డి పోలీసులతో అడ్డుకోవాలని చూడడం తన నిరంకుశ పాలనకు నిదర్శనం అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడ్డారు.

 అన్నం పెట్టే అన్నదాతలకు లాఠీ దెబ్బలా?

అన్నం పెట్టే అన్నదాతలకు లాఠీ దెబ్బలా?

జగన్ సర్కార్ పాలనకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. అన్నం పెట్టే అన్నదాతలకు లాఠీ దెబ్బలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం , యువత భవిత కోసం నిస్వార్ధంగా భూములు ఇవ్వటమే వారు చేసిన నేరమా అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. రైతుల కంట కన్నీరు పాలకుల పాలిట శాపంగా మారే రోజు దగ్గరలోనే ఉందని టీడీపీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ అమరావతి రైతుల పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి భయపడుతున్నారని,. అందుకే అణచివేతకు దిగారని తెలుగుదేశం పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+