పాదయాత్రలో బాబుకు జగన్ బిగ్ షాక్ ఇస్తారా: వైసిపిలో మాజీలు?

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు నేతలు ఇటు టిడిపి, అటు వైసిపి వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు నేతలు ఇటు టిడిపి, అటు వైసిపి వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది. అప్పుడే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు టిడిపిలోకి, వైసిపిలోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు అసంతృప్త అధికార, ప్రతిపక్ష నాయకులు టిడిపి, వైసిపిల్లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.

ముఖ్యంగా జగన్ పాదయాత్ర సమయంలో అసంతృప్త టిడిపి నేతలు కూడా వైసిపి వైపు వస్తారని అంచనా వేస్తున్నారు.

జగన్ పాదయాత్రలో..

జగన్ పాదయాత్రలో..

జగన్ అక్టోబర్ 27వ తేదీ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆయన పాదయాత్ర సమయంలో కడప, కర్నూలు జిల్లాల్లోని నేతలు కొందరు వైసిపిలో చేరవచ్చునని అంటున్నారు. టిడిపిపై అసంతృప్తితో ఉన్న నేతలు వైసిపి దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.

Recommended Video

    Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
    డిఎల్ వైసిపిలో చేరుతారా?

    డిఎల్ వైసిపిలో చేరుతారా?

    ఇందులో భాగంగా, కడప జిల్లా మైదుకూరు కీలక నేత, దివంగత సీఎం డిఎల్ రవీంద్రా రెడ్డి వైసిపి వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జగన్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయాత్ర సమయంలో డిఎల్ టిడిపిలో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు.

    పనబాక లక్ష్మి కూడానా?

    పనబాక లక్ష్మి కూడానా?

    కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతోంది. పనబాక వైసిపిలో చేరుతారనే ప్రచారాన్ని ఆమె కుటుంబ సభ్యులు కూడా కొట్టి పారేయడం లేదని చెబుతున్నారు.

    రామసుబ్బారెడ్డిని చల్లబరిచారు

    రామసుబ్బారెడ్డిని చల్లబరిచారు

    మంత్రి ఆదినారాయణ రెడ్డి చేరిక కారణంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న రామసుబ్బా రెడ్డి కూడా వైసిపి వైపు వెళ్తారనే ప్రచారం సాగింది. కానీ మంగళవారం జరిగిన కేబినెట్ భేటీలో రామసుబ్బా రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంతో ఆయన వైసిపిలోకి వెళ్లే అవకాశాలు లేవు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+