లోకేష్‌కు చెక్కు, అమ్మాయిల పాకెట్ మనీ.. (ఫోటో)

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.5 లక్షల విరాళం వచ్చింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌ను పాణ్యం మాజీ శాసన సభ్యుడు బీ పార్థసారథి రెడ్డి కలిశారు. విరాళంగా రూ.5 లక్షల చెక్కును అందచేశారు.

విద్యార్థుల పాకెట్ మనీ రూ.10వేల విరాళం

కార్యకర్తల సంక్షేమ నిధికి పార్టీకి చెందిన పలువురు నేతలు, ఇతరులు పెద్ద ఎత్తున గత కొంతకాలంగా విరాళాలు అందజేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు కూడా కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళం అందజేస్తున్నారు.

Former MLA gives Rs.5 lakh to Nara Lokesh

అనంతపురం జిల్లా కదిరికి చెందిన బీటెక్ చదువుతున్న ఎస్ రైనా ఉమ్రాజ్, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్ రూహీ ఫిర్దోస్‌లు పదివేల రూపాయల నగదును కార్యకర్తల సంక్షేమ నిధికి అందజేశారు.

వారు నారా లోకేష్‌ను కలుసుకున్నారు. నగదు మొత్తాన్ని ఆయనకు అందజేశారు. తమ పాకెట్ మనీని, కార్యకర్తల సంక్షేమ నిధికి ఇచ్చిన ఇద్దరు విద్యార్థినీలను, రూ.5లక్షలు ఇచ్చిన పార్థసారథి రెడ్డిని లోకేష్ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+