రాజకీయాల్లో పెను మార్పులు, ఆయనొస్తున్నాడు: చింతా మోహన్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో త్వరలో పెను మార్పులు సంభవించనున్నాయని మాజీ ఎంపి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఏపీ రాజకీయాల్లో నీతి, నిజాయితీ కలిగిన నాయకుడు వస్తున్నాడని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.

ఎందుకు ఓడించామా అని ఓట్లరు బాధపడాలి, కోడి పందెలను జూదంగా మార్చొద్దు: బాబు

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని సోమవారం నాడు మాజీ ఎంపి చింతా మోహన్ దర్శించుకొన్నారు. సుదీర్ఘ కాలంపాటు తిరుపతి ఎంపీగా చింతా మోహన్ ప్రాతినిథ్యం వహించారు.

వారానికి ఒక్క పూట, ఆమె సహకారం: భువనేశ్వరిపై చంద్రబాబు ఆసక్తికరం

చాలా కాలం తర్వాత చింతా మోహన్ రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. ఏపీ రాజకీయాలపై చింతా మోహన్ చేసిన కామెంట్లు చర్చకు దారితీశాయి. అయితే చింతా మోహన్ నర్మగర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఏపీ రాజకీయాల్లో నీతి, నిజాయితీ నేత వస్తున్నాడు

ఏపీ రాజకీయాల్లో నీతి, నిజాయితీ నేత వస్తున్నాడు

ఏపీ రాజకీయాల్లోకి నీతి , నిజాయితీ గల నాయకుడు వస్తున్నాడని మాజీ ఎంపి చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తులు సంపాదించాలనే కోరిక లేని నాయకుడు రాజకీయాల్లోకి వస్తున్నారని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే అలాంటి నాయకుడు ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయాలను మాత్రం చింతామోహన్ స్పష్టం చేయలేదు.

 దేవుడినే అడిగాను

దేవుడినే అడిగాను

ఏపీ రాజకీయాల్లోకి ఆస్తులు సంపాదించాలనే కోరిక లేని నాయకుడిని ఏపీ రాష్ట్రానికి భాద్యతలు స్వీకరించేందుకు పంపాలని దేవుడినే కోరుకొన్నానని చింతా మోహన్ చెప్పారు. ప్రస్తుత రాజకీయాలు బాగా లేవని ఆయన అభిప్రాయపడ్డారు.

 ఏపీ రాజకీయాల్లో మార్పులు

ఏపీ రాజకీయాల్లో మార్పులు

ఏపీ రాజకీయాల్లో త్వరలోనే పెద్ద ఎత్తున మార్పులు వచ్చే అవకాశం ఉందని చింతా మోహన్ అభిప్రాయపడ్డారు. 2019లో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికల సమయం నాటికి రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ తరుణంలోనే చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

చర్చకు దారితీసిన చింతా మోహన్ వ్యాఖ్యలు

చర్చకు దారితీసిన చింతా మోహన్ వ్యాఖ్యలు

మాజీ ఎంపి చింతా మోహన్ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సంచనాలకు దారితీశాయి. 2019 ఎన్నికల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకొనే అంశం ఉందని చింతా మోహన్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ప్రజలకు మేలు చేసే నాయకుడిని రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టేలా భగవంతుణ్ణి ప్రార్థించినట్టు చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MP Chinta Mohan sensational comments on Ap politics on Monday. He said that honest leader will enter in to Ap politics soon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి