Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెరపై జీవీ హర్షకుమార్: షర్మిలకు షాక్..!!

YS Sharmila: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిలపై రోజురోజుకూ సొంత పార్టీలో ఎదురుగాలి వీస్తోంది. అసమ్మతి తీవ్రత రానురాను పెరుగుతోంది. ఆమెకు వ్యతిరేకంగా సీనియర్ నాయకులు గళమెత్తుతోన్నారు. ఆమె నాయకత్వం పట్ల తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోన్నారు.

వైఎస్ జగన్ పైనే..

దీనికి కారణాలు లేకపోలేదు. ఓ రాజకీయ ప్రత్యర్థి పార్టీ అధినాయకురాలిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటానికి బదులుగా తోడబుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైనే దృష్టి సారించడం ప్రధాన కారణం.

Former MP GV Harsha Kumar made key allegations against APCC Chief YS Sharmila

ట్వీట్లు, స్టేట్‌మెంట్లు..

పీసీసీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచీ చంద్రబాబు సర్కార్‌పై చేసిన విమర్శల కంటే జగన్‌పై చేసిన ఆరోపణలే అధికంగా ఉన్నాయనేది తెలిసిన విషయమే. తన కుటుంబం, వ్యక్తిగత వివాదాలకు మాత్రమే షర్మిల పరిమితం అయ్యారనేది ఆమె చేస్తోన్న ట్వీట్లు, స్టేట్‌మెంట్లు, ప్రెస్ మీట్లను బట్టి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

సొంత పార్టీ నుంచే..

ఒకవంక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ.. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా అన్ని విధాలుగా పోరాటాన్ని సాగిస్తోంటే ఏపీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయ. చంద్రబాబుపై విమర్శలు గుప్పించినప్పటికీ- మాజీ ముఖ్యమంత్రి అంటూ జగన్‌ను సైతం సదరు వివాదంలోకి రావడం పరిపాటి అయిందనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తోన్నాయి.

జీవీ హర్షకుమార్ తెర మీదికి..

ఈ క్రమంలో తాజాగా పార్టీ సీనియర్ నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు జీవీ హర్షకుమార్ తెర మీదికి వచ్చారు. నేరుగా షర్మిలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు. ఓ జాతీయ పార్టీకి నాయకత్వాన్ని వహిస్తూ కుటుంబ వివాదాలకే అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారంటూ మండిపడ్డారు.

ఎక్కువగా విమర్శలు చేస్తోన్నది వాళ్ల అన్నయ్య మీదే..

ఓ యూట్యూబ్ ఛానల్‌కు జీవీ హర్షకుమార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత అన్నయ్య వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తే చాలు పార్టీ, రాష్ట్రం ఎలా పోయినా అనవసరం అనే విధానంలో షర్మిల వ్యవహరిస్తోన్నారంటూ విమర్శించారు. తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం, బీజేపీ కంటే కూడా ఆమె ఎక్కువగా విమర్శలు చేస్తోన్నది వాళ్ల అన్నయ్య మీదేనని అన్నారు.

ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యం..

ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీని, ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను విమర్శిస్తుంటారు గానీ ఏపీలో మాత్రం స్వయానా పీసీసీ చీఫ్ ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీని విమర్శించడం సరికాదని, దీనివల్ల కాంగ్రెస్ పుంజుకోలేకపోతోందని జీవీ హర్షకుమార్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి రావడం దౌర్భాగ్యమని ఘాటుగా విమర్శించారు.

ఇక్కడి ప్రజలు ఎందుకు ఒప్పుకొంటారు..

తాను తెలంగాణ ఆడబిడ్డను, తెలంగాణలో పుట్టిపెరిగాను, ఇక్కడే చదువుకున్నాను అంటూ గతంలో బహిరంగంగా చెప్పుకొచ్చిన షర్మిలను తీసుకొచ్చి ఏపీలో పార్టీ బాధ్యతను అప్పగిస్తే ఇక్కడి ప్రజలు ఎందుకు ఒప్పుకొంటారని జీవీ హర్షకుమార్ తేల్చి చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో ఒక శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయని, షర్మిల సైతం డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+