వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీటు బెల్టు పెట్టుకోలేదు!: హరికృష్ణ తనయుడి మృతి, ప్రమాదం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నందమూరి కటుంబంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాలో శనివారం సాయంత్రం దారుణం జరిగింది. నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరాం దుర్మరణం చెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో బయలుదేరారు. మునగాల మండలం, ఆకుపాముల దగ్గర జాతీయ రాహదారిపై యూటర్న్‌ తీసుకుంటున్న ట్రాక్టర్‌ను, జానకిరాం ప్రయాణిస్తున్న టాటా సఫారీ(ఎపీ29బీడీ2323) బలంగా ఢీకొంది.

ఈ ప్రమాదంలో జానకిరాంకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కోదాడ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జానకిరాం మరణించారు. ఈ ఘటనతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నందమూరి హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌ కోదాడకు పయనమయ్యారు.

జానకిరామ్ స్వయంగా కారు నడిపాడు. కారు నడిపే సమయంలో సీటు బెల్టు పెట్టుకోలేదు. జానకిరామ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. జానకీరామ్‌కు భార్య దీపిక, కుమారులు ఎన్టీఆర్, సౌమిత్రి ఉన్నారు.

ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ మాసాబ్‌ట్యాంకులోని స్వగృహానికి తరలించనున్నారు. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. జానకిరామ్ అతనొక్కడే లాంటి సినిమాలను నిర్మించారు. జానకీరామ్ ప్రయాణిస్తున్న కారు మూరు రౌండ్లు గుండ్రంగా తిరిగి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న గుంతలో పడింది. ఆ ప్రమాదంలో జానకీరామ తలకు, వెన్మెముకకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.

 జానకిరాం

జానకిరాం

నల్గొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్ దుర్మరణం చెందారు. జానకీరామ్ స్వయంగా నడుపుతున్న కారు ట్రాక్టర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

 జానకిరాం

జానకిరాం

నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన యలమంచి వెంకన్న అనే రైతు ఆకుపాముల సమీపంలో వరి నారు కొనుగోలు చేశారు. నారును ట్రాక్టర్‌లో లోడ్‌ చేసి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు.

 జానకిరాం

జానకిరాం

నిజానికి, తన ఊరు చేరుకునేందుకు విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల దూరం ప్రయాణించి, యూటర్న్‌ తీసుకోవాల్సి ఉంది. రెండు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందనే ఉద్దేశంతో, రాంగ్‌రూట్‌లో వస్తూ డివైడర్‌ వద్ద హైదరాబాద్‌ రోడ్డు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అప్పటికే ట్రాక్టర్‌ ఇంజన్‌ ముందుకు వెళ్లింది. ట్రాలీ మాత్రం విజయవాడవైపు వెళ్లే రోడ్డుపై మిగిలింది.

 జానకిరాం

జానకిరాం

జానకిరాం సఫారీ ఈ ట్రాలీనే ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌ వెంకన్నకు ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ దుర్ఘటన తర్వాత ఆయన సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు.

 జానకిరాం

జానకిరాం

వార్తాకథనాల ప్రకారం - ప్రమాదంలో సఫారీ నుజ్జునుజ్జుగా మారింది. ట్రాక్టర్‌ ఇంజన్‌, ట్రాలీ వేరై చెల్లాచెదురయ్యాయి. దీంతో కారు మూడు పల్టీలు కొట్టింది. వాహనం స్టీరింగ్‌ బలంగా ఒత్తుకుపోవడంతో జానకిరాం పక్కటెముకలు, కుడిచేయి విరిగిపోయాయి. ఛాతీపై రక్తగాయాలయ్యాయి. జానకిరాం తన వాహనంలోనే ఇరుక్కుపోయారు.

 జానకిరాం

జానకిరాం

వాహనంలో ఆయన ఒంటరిగా ఉన్నారు. చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు. ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అటువైపుగా ద్విచక్ర వాహనంలో వెళ్లిన వెంకటేశ్‌ అనే యువకుడు భారీ శబ్దం వినిపించడంతో వెనుతిరిగి చూశాడు.

 జానకిరాం

జానకిరాం

చెల్లాచెదురైన ట్రాక్టర్‌, సఫారీ వాహనాలు కనిపించాయి. ఆయన హుటాహుటిన బైక్‌ను వెనక్కి తిప్పి సంఘటన స్థలానికి వచ్చారు. ట్రాక్టర్‌ ఉంది గానీ దాని డ్రైవర్‌గానీ, ఇతర వ్యక్తులుకానీ కనిపించలేదు. సఫారీలో డ్రైవర్‌ సీటులో జానకిరాం కనిపించారు. జానకిరాంను కాపాడేందుకు ప్రయత్నించారు. తాను నందమూరి హరికృష్ణ కుమారుడిని అని చెబుతూ ఆయన అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

 జానకిరాం

జానకిరాం

ఈలోగా మరికొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. 108కు సమాచారం అందించారు. జానకిరాంను వాహనం నుంచి బయటికి తీశారు.

 జానకిరాం

జానకిరాం

అక్కడే ఉన్న ఆయన సెల్‌ఫోన్‌ తీసుకుని, ఇన్‌కమింగ్‌ జాబితాలో ఉన్న నెంబర్‌కు ఫోన్‌ కాల్‌ చేశారు. అది జానకిరాం సోదరుడు, సినీ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌కు వెళ్లింది.

 జానకిరాం

జానకిరాం

ప్రమాద సమాచారాన్ని వారు కల్యాణ్‌రామ్‌కు అందించారు. ఈలోపు 108 వాహనం వచ్చింది. జానకిరాంను తొలుత కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

 జానకిరాం

జానకిరాం

అక్కడి వైద్యుల సూచన మేరకు కోదాడలోనే ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. జానకిరాం అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

English summary
Former MP and actor Nandamuri Harikrishna’s son Janakiram was killed in a ghastly road accident near Akupamula crossroads on the Hyderabad-Vijayawda highway on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X