ఐటీ ఫ్రెషర్స్ కు అండగా విజయసాయిరెడ్డి..! ప్రభుత్వ జోక్యం కోరుతూ..!

ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. గత ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన స్ట్రైల్లో వ్యవసాయం మొదలుపెట్టేశారు. ఇప్పుడు ఆయన పలు రంగాలకు సంబంధించి తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. అదే సమయంలో సమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా మరో ట్వీట్ చేశారు.

ఇందులో ఆయన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గురించి ప్రస్తావించారు. దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గురించి తొలిసారి సాయిరెడ్డి గళం విప్పారు. ముఖ్యంగా ఐటీ రంగంలోకి అడుగుపెట్టే ఫ్రెషర్స్ కు తక్కువ జీతాలు ఇస్తున్న కంపెనీల వైఖరిపై సాయిరెడ్డి నిశిత విమర్శలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని వీరికి తగిన జీతాలు ఇప్పించాలని తాజాగా ఎక్స్ లో మాజీ ఎంపీ ఓ ట్వీట్ చేశారు.

former mp vijayasai reddy concern over low salaries to IT freshers says unfair

భారతదేశ ఐటీ రంగంలో ఎంట్రీ లెవల్ జీతాల స్తబ్దత చాలా అన్యాయమని విజయసాయిరెడ్డి తెలిపారు. 2010 నుండి ఐటీ సంస్థలకు జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ మరియు రికార్డు లాభాలు ఉన్నప్పటికీ, సగటు ప్రారంభ జీతం సంవత్సరానికి రూ.3.5 లక్షల వద్దే నిలిచిపోయిందని సాయిరెడ్డి తెలిపారు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా జీతాలను నిర్ణయించేలా ప్రభుత్వం ఐటీ కంపెనీలను ప్రోత్సహించాలని సాయిరెడ్డి కోరారు.

ప్రస్తుతం ఐటీ రంగంలోనూ ఏఐ రాకతో స్తబ్ధత ఏర్పడింది. ఉద్యోగాలు ఉంటాయో లేదో అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. ఇక ఫ్రెషర్స్ పరిస్ధితి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ ను తీసుకునేందుకు జంకుతున్నాయి. దీంతో ఉన్నత చదువులు పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేక యువత అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రెషర్స్ కు తక్కువ జీతాలు ఇస్తున్న ఐటీ కంపెనీలపై సాయిరెడ్డి ట్వీట్ ఆలోచింపజేసేలా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+