టీటీడీ నిర్ణయానికి సాయిరెడ్డి ఫుల్ సపోర్ట్.. ! రామ్మోహన్ నాయుడికి రిక్వెస్ట్..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి ఆ తర్వాత ప్రభుత్వం మారగానే ఎంపీ పదవికీ, రాజకీయాలకూ గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటున్న విజయసాయిరెడ్డి.. రాజకీయంగా యాక్టివ్ గానే ఉంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకున్నాక వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై ఎక్స్ లో ట్వీట్లు పెట్టడం, బహిరంగ వ్యాఖ్యలు చేయడం దగ్గరి నుంచి విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వడం వరకూ చాలా చేశారు. ఇదే క్రమంలో ఇప్పుడు సాయిరెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మధ్యే రేణిగుంటలోని తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం పేరును శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా మార్చాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ నిర్ణయంపై విజయసాయిరెడ్డి స్పందించారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయానికి విజయసాయిరెడ్డి మద్దతు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ పోస్టు కూడా పెట్టారు.

former mp vijayasai reddy supports reniguntunta airport name change request from ttd

రేణిగుంట ఎయిర్ పోర్టు (తిరుపతి ఎయిర్ పోర్టు)కు శ్రీ వెంకటేశ్వర అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా పేరు మారుస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం శ్రీ వెంకటేశ్వరుడికి అంతర్జాతీయంగా ఉన్న ప్రాధాన్యతను, తిరుమల ఆధ్యాత్మిక వారసత్వానికి గౌరవం ఇచ్చేలా ఉందని సాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు పేరు మార్పుపై చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడిని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+