రూటు మార్చిన సాయిరెడ్డి..! ఫ్యూచర్ పై క్లారిటీ-రెడ్లకు పిలుపు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించి అనంతరం అధికారం పోయాక పార్టీకి, ఎంపీ పదవికి, రాజకీయాలకు గుడ్ బై చెప్పేసినట్లు ప్రకటించి.. మళ్లీ తాజాగా యూటర్న్ తీసుకున్న విజయసాయిరెడ్డి (vijayasai reddy) మరో ట్విస్ట్ ఇచ్చారు. త్వరలోనే రాజకీయంగా యాక్టివ్ అవుతానని ప్రకటించిన ఆయన.. ఇవాళ జరిగిన రెడ్డి సామాజిక వర్గ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎక్కడా ఏ పార్టీలో చేరతారో చెప్పకుండానే చెప్పాల్సిందంతా చెప్పేశారు.
దేశం మీద, భారత సంస్కృతి మీద కొన్ని శతాబ్దాలుగా దాడి జరుగుతోందని, మన దేశం, ప్రజల, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గంపై ఉందని విజయసాయిరెడ్డి తెలిపారు. దేశ సంస్కృతిని కాపాడుకోవడంలో రెడ్లు ముందుండాలన్నారు.. విదేశీయుల పాలన పోయినా మన సంస్కృతి మీద దాడులు మాత్రం ఆగలేదన్నారు. దేశంలో అంతర్గత కలహాలు సృష్టిస్తున్న శక్తుల పట్ల రెడ్డి సామాజిక వర్గం అప్రమత్తంగా ఉండాలన్నారు.

హిందూ ధర్మానికి కాపు కాద్దాం…కలసి రండి…. మత మార్పిడులు అడ్డుకుందాం….రెడ్డి అనుబంధ మహోత్సవ కార్యక్రమంలో విజయసాయి పిలుపు. pic.twitter.com/ao1IUStfu8
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 2, 2026
హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రెడ్డి సామాజిక వర్గంపై ఉందన్నారు. దాడుల్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఓ ప్రణాళికబద్దంగా ముందుకెళ్లాలని కోరారు. రెడ్డి జాతి ద్వేషించే జాతి కాదని, ప్రపంచాన్ని ప్రేమించే జాతి అన్నారు. సమాజంలో విభజనను భిన్నత్వంలో ఏకత్వంగా భావించలేమన్నారు. దేశం గొప్పా, మతం గొప్పా అని అడిగితే మతమే గొప్ప అనే వాళ్లు ఈ దేశంలో ఉన్నారన్నారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగేటప్పుడు మా మతమే గెలవాలని కోరుకునే వాళ్లు ఉన్నారన్నారు. ఇలాంటి సంస్కృతిని ఎప్పుడూ ప్రోత్సహించకూడదన్నారు.

పహల్గాంలో అమాయకుల్ని రాజకీయాలకు సంబంధం లేని వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపేశారన్నారు. పేరు తెలుసుకుని హిందువుల్ని మాత్రమే చంపారన్నారు. చంపిన వాళ్లను సపోర్ట్ చేసిన వాళ్లు ఈ దేశంలో ఉన్నారన్నారు. మత ఛాందసం, తీవ్రవాదం, విధ్వంసం హిందూ ధర్మంలో లేదని, మిగతా ధర్మాల్లో ఎలా పాతుకుపోయిందో గుర్తించాలన్నారు. ఈ ధోరణి మీద అందరూ తిరగబడాలని, ఇదే పరిస్ధితి కొనసాగితే మన సంస్కృతి, సంప్రదాయాలు మంటగలిసిపోతాయన్నారు. పాశ్చాత్య దేశాల వంటి పరిస్ధితి మనకు రాకూడదని కోరుకుంటున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్ లో హిందువుల్ని కిరాతకంగా చంపే పరిస్ధితి ఉందన్నారు. భవిష్యత్తులో భారత్ కూడా ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ లా మారకుండా చూసుకోవాలన్నారు. మతమార్పిడులు కొనసాగితే హిందూ ధర్మం అంతరించిపోతుందన్నారు. ఈ బాధ్యతను ఓ ఉద్యమంగా అందరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications