అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్ధానిక పోరుకు ముందే జగన్ తో నిమ్మగడ్డకు చెడిందా ? అఫిడవిట్ లో సంచలన అంశాలు...

|
Google Oneindia TeluguNews

ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కు ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్దమంటూ ఆయన ఘాటుగా స్పందించారు. తాను చేసే ప్రతీ పనీ కమిషన్ లోని సిబ్బందికి తెలియాల్సిన అవసరం లేదన్నారు.

నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..నిమ్మగడ్డ లేఖపై మరో సంచలనం-ఆధారాల ధ్వంసం..సీఐడీ దర్యాప్తు కలకలం..

నిమ్మగడ్డ సమాధానంలో కీలకాంశాలు..

నిమ్మగడ్డ సమాధానంలో కీలకాంశాలు..

ఏపీ ఎన్నికల కమిషనర్ గా తన తొలగింపు కోసం ప్రభుత్వం తన కౌంటర్ అఫిడవిట్ లో పేర్కొన్న కారణాలపై మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఘాటుగా బదులిచ్చారు. ప్రభుత్వం తన కౌంటర్లో సంబంధం లేని అంశాలను ప్రస్తావించిందని, ఎన్నికల సంస్కరణలు ఫిబ్రవరిలోనే ప్రారంభించామనడం వాస్తవం కాదన్నారు. వివిధ స్ధాయిల్లో చర్చించాక సంస్కరణల అమలు ప్రారంభించామనడం అబద్ధమని నిమ్మగడ్డ తన సమాధానంలో పేర్కొన్నారు.

 ఈసీని సంప్రదించకుండానే....

ఈసీని సంప్రదించకుండానే....


రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను కుదిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా ఫిబ్రవరి 20న ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని, దీనిపై ఎన్నికల సంఘంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని నిమ్మగడ్జ హైకోర్టులో దాఖలు చేసిన సమాధానపత్రంలో పేర్కొన్నారు. ఆర్డినెన్స్ పై అభ్యంతరాలు తెలియజేస్తూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశానన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలన్నీ వ్యతిరేకించాయన్నారు.
షెడ్యూల్ కుదింపు వల్ల చాలా మంది అభ్యర్ధులు తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్ కు వెళ్లలేకపోయారు. ప్రభుత్వం చెబుతున్న ఎన్నికల సంస్కరణలు వాస్తవిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నాయని నిమ్మగడ్డ తన సమాధానంలో వివరించారు. వాస్తవానికి ఇవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే ఉన్నాయన్నారు.

సంస్కరణలు నాకు వర్తించవు...

సంస్కరణలు నాకు వర్తించవు...

ఎన్నికల కమిషన్ లో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చి సంస్కరణలు అప్పటికే పదవిలో ఉన్న తనకు వర్తించబోవని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందరరెడ్డి తన అఫిడవిట్ లో లేవనెత్తిన అభ్యంతరాలకు సైతం నిమ్మగడ్డ ఇందులో సమాధానం ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజువారీ పనుల్లో సాయం చేయడం మాత్రమేనన్నారు.

 స్ధానిక ఎన్నికల వాయిదా రహస్యమే..

స్ధానిక ఎన్నికల వాయిదా రహస్యమే..


స్ధానిక సంస్ధల ఎన్నికల వాయిదా అనేది అత్యంత రహస్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమే అని నిమ్మగడ్డ రమేష్ తన సమాధాన పత్రంలో హైకోర్టుకు తెలిపారు. ఎన్నికల సంఘంలోని న్యాయవిభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాతే తాను సంతకం చేసినట్లు నిమ్మగడ్డ తెలిపారు. వాయిదా నిర్ణయం మీడియా సమావేశానికి ఓ రోజు ముందే తీసుకున్నట్లు నిమ్మగడ్డ తెలిపారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ కు విచక్షణాధికారాలు ఉన్నట్లు చెప్పారు. కమిషనర్ నిర్ణయాన్నీ కమిషన్ లోని ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదన్నారు.

Recommended Video

AP CM Jagan Asks For lockdown Extension in Conference With PM Modi
కేంద్రానికి లేఖ, కడపలో ఏకగ్రీవాలపై...

కేంద్రానికి లేఖ, కడపలో ఏకగ్రీవాలపై...

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై కేంద్రానికి లేఖ రాశానని, ఈ ఘటనలకు, ప్రభుత్వ లెక్కలకు, మీడియా వార్తలకూ ఎక్కడా పొంతన లేదన్నారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలను గమనిస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని అర్ధమవుతోందన్నారు. గతంలో కడప జిల్లాలో 2 శాతం ఎంపీటీసీ స్ధానాలు ఏకగ్రీవమైతే ఈసారి అధి 24 శాతంగా ఉందన్నారు. అలలాగే జడ్పీటీసీల్లో గతంలో ఒకస్ధానం ఏకగ్రీవమైతే ఈసారి 126 స్ధానాలు ఏకగ్రీవమయ్యాయయన్నారు.

English summary
former ap election commissioner nimmagadda ramesh kumar files counter affidavit in his removal case in high court. in his counter, nimmagadda alleged that govt has no right to involve in election commissioner's duties and he had every right to take any action regarding conducting of elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X