వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదంలో సిమీ మాజీ చీఫ్ సల్లావుద్దీన్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

నల్లగొండ: నల్గగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో శనివారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదంలో సిమీ మాజీ జాతీయాధ్యక్షుడు సలావుద్దీన్ అహ్మద్ (45) మరణించాడు. హైదరాబాదులోని చాంద్రాయణగుట్టకు చెందిన సలావుద్దీన్ నల్లగొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై కారులో హైదరాబాదు తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో మరణించాడు.

పెద్దకాపర్త్ి శివారులోకి రాగానే ముందు వెళ్తున్ వాహనాన్ని సలావుద్దీన్ ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సలావుద్దీన్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాదులోని సాయిసంజీవనీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడు.

Former SIMI president Syed Salahuddin dies in car accident

సలావుద్దీన్ గతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్ (సిమి) జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లోని పేద ముస్లిం యువకులను సిమీ వైపు అతను ఆకర్షించినట్లు చెబుతారు.

ఈ ప్రమాదంలో మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. మృతి చెందిన సలావుద్దీన్‌పై పలు కేసులు ఉన్నాయి. వివరాలు ఇంకా అందాల్సి ఉంది.

English summary

 Former president of Student Islamic Movement of India (SIMI) Syed Salahuddin, passed away in a car accident on Saturday.He was on his way Hyderabad from Nalgonda when the accident took place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X