సింగపూర్ మాజీ ప్రధానితో బాబు, అవతరణ 'చిక్కు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సింగపూర్‌ మాజీ ప్రధాని చాక్‌టాంగ్‌ బృందం సోమవారం ఉదయం హైదరాబాదులో సమావేశమైంది. రాజధాని నిర్మాణంపై వారు చర్చించారు. రాజధాని నిర్మాణం, తదితర అంశాల పైన వారితో బాబు చర్చించారు.

చంద్రబాబు వద్దకు ఏపీ అవతరణ దస్త్రం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించాలన్న దాని పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అయితే, విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరపాలనే విషయమై ఏపీ ప్రభుత్వం డైలమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Former Singapore PM meets Chandrababu

రాష్ట్ర అవతరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ చిక్కు వచ్చి పడింది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విభజన తర్వాత ఏర్పడిన రాష్ట్రం కావడంతో జాన్ రెండో తేదీని లెక్కలోకి తీసుకోవాలా? లేక నవంబర్ ఒకటిన ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన దినాన్నే రాష్ట్రావతరణ దినోత్సవంగా పరిగణించాలా? లేక తొలుత మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు అక్టోబర్ ఒకటో తేదీన ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం జరిగినందున దానిని ఉత్సవ తేదీగా నిర్ణయించాలా? అని ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.

వీటిపై చర్చోపచర్చలు జరిపిన అనంతరం ఉన్నతాధికారులు ఇందుకు సంబంధించిన ఫైలును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపించారు. చంద్రబాబు ఈ విషయంపై పండితులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+