ప్రేమ-పెళ్లి కథ: ఉత్తరాంధ్రకు ఐర్లాండ్ ‘ఛాంపియన్’ అల్లుడు

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: విదేశీయులు మనవాళ్లను పెళ్లి చేసుకోవడం, మనవాళ్లు విదేశీయులను పెళ్లి చేసుకోవడం తరచుగా జరుగుతూనే ఉంటుంది. తాజాగా అలాంటి సన్నివేశమే మరోటి వెలుగుచూసింది. ఐర్లాండ్‌కు చెందిన స్నూకర్ ఛాంపియన్ ఒకరు ఉత్తరాంధ్రకు అల్లుడయ్యాడు. ఉత్తరాంధ్ర యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడీయన.

శ్రీకాకుళం-ఐర్లాండ్

శ్రీకాకుళం-ఐర్లాండ్

ఐర్లాండ్‌కు చెందిన కెన్‌ డోహర్టి 1997 వరల్డ్‌ స్నూకర్‌ చాంపియన్‌. ఆయన ప్రస్తుతం మరోసారి ఛాంపియన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, డోహర్టి ప్రేమించి పెళ్లి చేసుకున్న సారా తండ్రి డాక్టర్‌ ప్రసాద్‌ది శ్రీకాకుళం జిల్లా సోంపేట. ప్రసాద్‌ కొద్దికాలం విజయనగరంలో చదువుకుని తర్వాత వెల్లూరులో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.

ప్రేమ-పెళ్లి

ప్రేమ-పెళ్లి

కాగా, ప్రసాద్‌ భార్య జెస్సికా స్వస్థలం తమిళనాడు. వీరి కుమార్తె డాక్టర్‌ సారాకు ఐర్లాండ్‌ రాజధాని డబ్లిన్‌లో ఓ స్నూకర్‌ టోర్నీ సందర్భంగా డోహర్టితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో డోహర్టి, సారాలు 2001లో వివాహబంధంతో ఒక్క టయ్యారు. కాగా, డోహార్టి-సారాలకు ఓ కూతురు ఉంది.

విశాఖలో విజయం

విశాఖలో విజయం

ప్రస్తుతం 47ఏల్ల డోహర్టి విశాఖపట్నంలో జరుగుతున్న వరల్డ్‌ ర్యాంకింగ్‌ స్నూకర్‌ టోర్నీలో ఆడుతున్నాడు. గురువారం ఇంగ్లాండ్‌కు చెందిన సామ్‌ బైర్డ్‌తో అతడు తలపడ్డాడు. ఈ మ్యాచ్‌ను డోహర్టి అత్త, మామ, ఇతర కుటుంబ సభ్యులతోపాటు విశాఖలోని వారి బంధువులు హాజరయ్యారు. కాగా, ఈ పోరులో విజయం సాధించాడు డోహర్టి.

చాలా సంతోషం

చాలా సంతోషం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మ్యాచ్‌ను చూసేందుకు ఆస్ట్రేలియా నుంచి తన అత్తమామలు జెస్సికా, ప్రసాద్‌ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మ్యాచ్‌లో ఉత్కంఠను తట్టుకోలేక వారు బోర్డు హాలు నుంచి బయటకు వెళ్లిపోయారని తెలిపారు.

మరింత ఉత్సాహంతో..

మరింత ఉత్సాహంతో..

హోరాహోరీ మ్యాచ్‌లో విజయం సాధించి బంధువులతో ఆనందం పంచుకోవడం మరింత ఉత్సాహాన్నిస్తోందని డోహార్టి చెప్పారు. ప్రత్యర్థిని బట్టి తన ఆటతీరు ఉంటుందని, వచ్చే మ్యాచ్‌లలో కూడా గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని వివరించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former snooker world champion Ken Doherty says that he has the determination, grit and desire to return to the top. For someone who won the World championship two decades ago, the 47-year-old Irishman is embarrassed of dropping out of the tour after his ranking plummted.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి