వైసీపీ ఎమ్మెల్యేను రూ.20 కోట్లు అడిగిన టీడీపీ మాజీ మంత్రి?
తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశ్రమలను ముంచేస్తే సీఎం వైఎస్ జగన్ వాటికి చేయూత అందించారని రాష్ట్రంలో కొత్తగా 2 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. 'పారిశ్రామికాభివృద్ధి-పెట్టుబడులు'పై జరిగిన శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. కరోనా లాంటి విపత్తు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని, ప్రత్యేక ప్యాకేజీలిచ్చి పరిశ్రమలకు అండగా నిలిచిందనే విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, జాతీయస్థాయిలో పోటీపడి బల్క్ డ్రగ్ పార్క్ సాధించినట్లు చెప్పారు.
ఏపీలో వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతోందని, దీనివల్ల ఎంతో మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక రంగం చాలా ఇబ్బందులకు గురైందని, గతంలో ఏపీలో పర్రిశమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు పలురకాల సమస్యలు ఎదుర్కొన్నారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు లభిస్తున్నాయన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడమేకానీ అమలు పరిచిందే లేదన్నారు.

చిలకలూరిపేటకు చెందిన ఒక టీడీపీ మాజీ మంత్రి సిగ్గు లేకుండా తనను లంచం అడిగాడని బ్రహ్మ నాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలో తనకు ఎదురైన సంఘటన గురించి ఆయన సభలో వివరించారు. 2012లో గౌతమ్‌బుద్ధ టెక్సాస్ పార్క్ కోసం టెండర్ వేశానని, అది తనకే వచ్చిందని, డబ్బులు చెల్లించడంతో రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని బ్రహ్మనాయుడు చెప్పారు. కేంద్రం నుంచి రూ. 40 కోట్లు రాయితీ రూపంలో వచ్చాయని, అవి వచ్చిన తర్వాత ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిందని, రూ.40 కోట్ల రాయితీలో తమకు రూ.20 కోట్లు లంచం ఇవ్వాలని, లేదంటే అనుమతిచ్చమన్నారంటూ సదరు నేతపై బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications