వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రులపై అయ్యన్న హాట్ కామెంట్స్-మల్లెపూల అంబటి, లోకేష్ మగతనానికి రోజాటెస్ట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న పొలిటికల్ వార్ లో జగన్ కేబినెట్ ప్రక్షాళన తర్వాత మంత్రులపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇవాళ కేబినెట్ మంత్రులపై తీవ్ర విమర్శలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు హాట్ కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.

ఏపీలో సీఎం జగన్ తలకు మాసిన వెధవలకు , సన్నాసులకు మంత్రి పదవులు ఇచ్చారంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు. మల్లెపూలు అమ్మే అంబటికి జలవనరుల శాఖ ఏంటని ఆయన ప్రశ్నించారు.
అరగంట , గంట అక్కడ కాకుండా , అధికారులతో సమావేశమైతే పులిచింతల ఎక్కడ కట్టారో అంబటికి తెలుస్తోందంటూ గతంలో అంబటి చేసిన కామెంట్స్ ఆయనపైనే ప్రయోగించారు.

former tdp minister ayyannapatrudu hot comments on ysrcp ministers including roja, ambati

మహిళా మంత్రి ఆర్కే రోజానూ అయ్యన్న వదల్లేదు. రోజా ఆమె మొగుడికు చీర కట్టి ఇంట్లో కూర్చుబెట్టిందంటూ అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే లోకేష్ మగతనం ఓసారి టెస్ట్ చేయాలని రోజాకు ఆయన సూచించారు.
మరో మంత్రి బొత్సపైనా అయ్యన్న తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. బొత్సకు విద్యాశాఖ ఇవ్వడం దౌర్బాగ్యమన్నారు.
పదో తరగతి పేపర్ లీక్ కాకపోతే టీచర్స్ ను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం లో ఉన్న పోలీసులు అంతా తాడేపల్లి ప్యాలెస్ కు కాపలకాయడానికే సరిపోతున్నారని అయ్యన్న విమర్శించారు. ఓ దొంగ కు పోలీసులు కాపలా కాయడం మన రాష్ట్ర దౌర్బగ్యమంటూ జగన్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.

మొన్ననే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను గుడ్డలూడదీసి కొట్టారంటూ గోపాలపురం ఘటనపై అయ్యన్నపాత్రుడు విమర్శలు చేశారు. గడపగడపకు వెళ్తే ఎంత మందిని కొడతారు చూడాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను జగన్ రెడ్డి మోసం చేశాడని, రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు మరల సీఎం కావాల్సిన ఆవశ్యకత ఉందంటూ అయ్యన్న చెప్పుకొచ్చారు.

English summary
former tdp minister ayyannapatrudu on today made hot comments on ap cabinet ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X