ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమ్మినేనీ ఒళ్లు దగ్గరపెట్టుకో- మల్లెపూల అంబటీ మంత్రేనా ? మహానాడులో అయన్న తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

టీడీపీ మహానాడును ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ మంత్రుల బస్సుయాత్రసందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. టీడీపీ మహానాడుకు వైసీపీ మంత్రుల బస్సుయాత్ర పోటీకాదంటూనే మహానాడా వల్లకాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహానాడులో టీడీపీ నేతలు తీవ్ర పదజాలంతో కౌంటర్లు ఇస్తున్నారు.

టీడీపీ మహానాడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై ఇవాళ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు. మహానాడును వల్లకాడంటావా ఆ వల్లకాడులోనే నిన్నూ, మీ నాయకుడిని టీడీపీ కార్యకర్తలు తగులబెడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ తమ్మినేనిని దౌర్భాగ్యుడంటూ వ్యాఖ్యానించారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఇవాళ టీడీపీ కార్యకర్యలకు కోపం వస్తే మీ తాటతీస్తారని అయ్యన్న హెచ్చరించారు.

former tdp minister ayyannapatrudu serous remarks on speaker tammineni, minister ambati

టీడీపీ అంటేనే ఓ చరిత్ర అని, ఎన్టీఆర్ వంటి మహానుభావుడు పెట్టిన పార్టీలో పనిచేయడం మనందరినీ అదృష్టమన్నారు. చిన్నవయసులోనే తనను పిలిచి ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర ఎన్టీఆర్ దన్నారు. ఎన్టీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం తపించిన నాయకుడన్నారు. రాజకీయాల్లోకి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మహిళలు వచ్చినా దానికి కారకుడు ఎన్టీఆర్ అని అయ్యన్న తెలిపారు. అలాంటి మహానుభావుడు పెట్టిన ఈ టీడీపీని 40 ఏళ్లుగా నడిపించుకుంటున్నాం అన్నారు. మళ్లీ చంద్రబాబు, లోకేష్ నాయకత్వం మరో 40 ఏళ్లు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.

former tdp minister ayyannapatrudu serous remarks on speaker tammineni, minister ambati

రాష్ట్రంలో ఓ శాడిస్టు, ఓ పనికిమాలిన వాడి వాలన సాగుతోందని అయ్యన్న మండిపడ్డారు. రాష్ట్రం తగులపడిపోయిందని, అప్పులపాలైపోయిందని, అన్నివర్గాల వారికీ అన్యాయం జరిగిందని అయ్యన్న తెలిపారు. టీడీపీ అందరి పార్టీ అని, చంద్రబాబు గతంలో కేంద్రంలో చక్రం తిప్పి బాలయోగిని స్పీకర్ గా చేశారన్నారు. ప్రతిభా భారతిని రాష్ట్రంలో స్పీకర్ గా, ఎర్రన్నాయుడిని కేంద్రమంత్రిగా చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా ప్రతిపాదించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. అలాంటి పార్టీని అందరూ కాపాడుకుకోవాలని అయ్యన్న పిలుపునిచ్చారు. ఓసారి మహానాడుకు వచ్చిన జనాల్ని చూడాలని వైసీపీ నేతలకు సూచించారు. పోలీసులు సహకరించకున్నా, బస్సులు ఇవ్వకపోయినా ఇంతమంది మహానాడుకు వచ్చారన్నారు.

రాష్ట్రంలో పనికిమాలినోళ్లంతా మంత్రులైపోయారని అయన్న విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబూ ఓ మంత్రా అని ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రంట.. ఇరిగేషన్ అంటే తెలియదని అయ్యన్న విమర్శించారు. పోలవరం ఆనకట్టో కాదో తెలియదన్నారు. రాత్రి మల్లెపూలు అమ్ముకున్న అంబటికి ఇరిగేషన్ మంత్రి ఇస్తారా అని నిలదీసారు.
రోజా టీడీపీ నేతలకు చీరలు పంపిస్తానంటోందని, కానీ ఇంట్లో భర్తకు చీరకట్టి కూర్చోబెట్టిందన్నారు.

English summary
former tdp minister ayyannapatrudu on today slams speaker tammineni sitaram on his comments on tdp mahanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X