వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంటా కీలక అనుచరుడు నందకిషోర్ మృతి.. గతంలో సీఐడీ అరెస్టు... తర్వాత విడుదల..

|
Google Oneindia TeluguNews

టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అనుచరుడు నంద కిషోర్ ఇవాళ ఉదయం విశాఖలో మృతి చెందారు. గుండెపోటు రావడంతో నంద కిషోర్ చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. తన సన్నిహితుడు నంద కిషోర్ ను సీఐడీ అరెస్టు చేయడంపై గంటా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నంద కిషోర్ మృతి నగరంలో కలకలం రేపింది.

వైసీపీలోకి గంటా శ్రీనివాస్ ? ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్ ? - వారు వద్దంటున్నా...వైసీపీలోకి గంటా శ్రీనివాస్ ? ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్ ? - వారు వద్దంటున్నా...

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కొన్నేళ్లుగా అన్నీ తానై వ్యవహరిస్తున్న నంద కిషోర్ ను తాజాగా సీఐడీ పోలీసులు జూన్ లో అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై నంద కిషోర్ ను సీఐడీ అప్పట్లో అరెస్టు చేసింది. నందకిషోర్ ను కలిసేందుకు విశాఖ సీఐడీ కార్యాలయానికి వచ్చిన గంటా శ్రీనివాస్ ను పోలీసులు అనుమతించలేదు. దీనిపై అప్పట్లో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నందకిషోర్ విషయంలో సిఐడి అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. నందకిషోర్ ఏమైనా దేశ ద్రోహానికి పాల్పడ్డారా? రక్షణ వ్యవహారాలను లీక్ చేశారా? ఏమైనా దొంగతనాలు చేశారా ? అని ప్రశ్నించిన ఆయన కేవలం సోషల్ మీడియాలో ఫార్వర్డ్ అయిన మెసేజ్ ను షేర్ చేసినట్లుగా పేర్కొన్నారు.

former tdp minister ganta srinivass close aide nanda kishore died

అయితే 68 ఏళ్ల నందకిషోర్ ను ఆ తర్వాత కోర్టు జోక్యంతో సీఐడీ విడిచిపెట్టింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటున్న నంద కిషోర్ ఇవాళ గండెపోటుతో చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సీఐడీ కేసు తర్వాత ఆయన తీవ్ర ఒత్తిడికి లోనయినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో నంద కిషోర్ మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

English summary
former minister and tdp mla ganta srinivasa rao's close aide nanda kishore died with cardiac arrest this morning, his family members says. recently cid had arrested him in social media posts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X