వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ నేతలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వార్నింగ్ .. అసలేం జరిగిందంటే

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రోజుకో చోట ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటూనే ఉంది. ఇక తాజాగా నంద్యాల గణేష్ ఉత్సవాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ ఘర్షణలో ఒక టిడిపి కార్యకర్త తీవ్రంగా గాయాలపాలు కావడంతో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకుడు భూమా బ్రహ్మానందరెడ్డి వైసిపి నేతలపై ధ్వజమెత్తారు. సాఫ్ట్ గా చెబుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)

 గణేష్ నవరాత్రుల వేడుకల్లో టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణ

గణేష్ నవరాత్రుల వేడుకల్లో టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణ


అసలేం జరిగిందంటే సోమవారం నంద్యాలలోని 42 వ వార్డులో గణేశ్ ఉత్సవాల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వైసీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టిడిపి కార్యకర్తను వైసీపీ నేతలు తీవ్రంగా కొట్టారు. అయితే గత ఎన్నికల సమయంలో వైసిపి కౌన్సిలర్ అభ్యర్ధికి కాకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపినందుకు టిడిపి కార్యకర్త మణిపై వైసిపి కౌన్సిలర్ భర్త కిరణ్, అతని అనుచరులు దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు . టిడిపి కార్యకర్త మణికి తీవ్ర గాయాలు కావడంతో అతనిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం టిడిపి కార్యకర్త మణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

నంద్యాల టీడీపీ కార్యకర్త మణికి తీవ్ర గాయాలు .. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఈ క్రమంలో గాయపడిన మణికుమార్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో స్థానిక వైసీపీ నేతలకు భూమా బ్రహ్మానంద రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దాడులకు భయపడే వాళ్ళెవరూ నంద్యాలలో లేరని ఆయన వెల్లడించారు.

పర్సనల్ గా తీసుకుంటే తాము పర్సనల్ గా తీసుకుని దాడులు చేస్తామన్న భూమా బ్రహ్మానందరెడ్డి

పర్సనల్ గా తీసుకుంటే తాము పర్సనల్ గా తీసుకుని దాడులు చేస్తామన్న భూమా బ్రహ్మానందరెడ్డి

రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలపై వైసిపి నాయకులు దాడులకు పాల్పడ్డారని మండిపడిన భూమా బ్రహ్మానందరెడ్డి వైసిపి నాయకుల దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నాయకులు వ్యక్తిగతంగా తీసుకుని దాడులు చేస్తే తాము కూడా అలాగే పర్సనల్ గా తీసుకొని దాడులు చేయాల్సి వస్తుందని, చేతులు కట్టుకుని ఎవరూ లేరని గట్టిగా హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజూ ప్రతిపక్ష పార్టీల నాయకుల పై దాడులకు పాల్పడలేదని భూమా బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసే బదులు, అభివృద్ధి చేయడంపై దృష్టి పెడితే బాగుపడతారని, అలా కాకుండా ఇలా అరాచకాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వైసిపి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Recommended Video

Spl Report On Trs LeadersCounter To Revanth Reddy
టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఫైర్ అవుతున్న టీడీపీ నాయకులు

టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై ఫైర్ అవుతున్న టీడీపీ నాయకులు


ఇప్పటికే రాష్ట్రంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయాయని, తప్పుడు కేసులు బనాయిస్తూ టిడిపి మద్దతుదారులను భయాందోళనలకు గురి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో చోట కార్యకర్తలపై జరుగుతున్న దాడులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఇక టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ, వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తూ ఎవరూ భయపడవద్దని చెప్తున్నారు.

English summary
Bhuma Brahmanandareddy, who was incensed that YCP leaders had carried out attacks on two TDP activists in a span of two days, expressed outrage that the attacks by YCP leaders were increasing day by day. YCP leaders have strongly warned that if they carry out attacks in person, they will have to carry out attacks in person as well. Bhuma Brahmanandareddy said that when they were in power, they never attacked the leaders of the opposition parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X