జమిలి ముందుకొస్తోంది ? బాబు, రేవంత్..బీ అలర్ట్-మాజీ కేంద్రమంత్రి షాకింగ్..!

కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఈసారి జమిలి ఎన్నికలు ఖాయమని ఎప్పుడో తేల్చేసింది. ఇప్పుడు వరుసగా హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న కేంద్రం.. జమిలి ఎన్నికల్ని ముందుకు జరుపుతోందా ? ఈ మేరకు ఢిల్లీలో ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయా ? అంటే అవునంటున్నారు ఏపీకి చెందిన మాజీ కేంద్రమంత్రి. ఈ మేరకు అలర్ట్ గా ఉండాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆయన కోరారు.

తిరుపతి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అక్కడ పార్టీ పెద్దలతో పాటు పలువురు కీలక వ్యక్తుల్ని ఆయన కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రాజకీయం మారుతోందన్న అంశాన్ని ఆయన తెలుసుకున్నారు. అంతే కాదు దాన్ని బయటపెట్టారు కూడా. అంతా ఊహిస్తున్నట్లుగా 2028లోనే 2029లోనో కాదు 2027లోనే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని చింతా మోహన్ ఇవాళ తెలిపారు.

former union minister chinta mohan alerts chandrababu revanth reddy over simultaneous polls in 2027

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ మేరకు జమిలి ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలని చింతా మోహన్ సూచించారు. నిన్న తాను ఢిల్లీ వచ్చానని, కాసేపు అటూ, ఇటూ తిరిగానని, ఢిల్లీలో దాగివున్న రాజకీయ రహస్యం తెలిసిపోయిందని చింతా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా పోలవరంలో ఓ ముఖ్యమంత్రి 6 వేల కోట్లు అక్రమంగా సంపాదించడని, ఆయన పేరు తాను చెప్పదల్చుకోలేదన్నారు.

గతంలో చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నట్లు మోడీ చేసిన ఆరోపణలపై ప్రశ్నిస్తే..ఆయన చాలా భయస్తుడని, కాస్తో కూస్తో... భయం, నీతి ఉందన్నారు. ఆయన చాలా జాగ్రత్త పరుడన్నారు. పార్టీలు వేరైనా, తామిద్దరిదీ ఒకటే ప్రాంతం అన్నారు. చంద్రబాబు గురించి తనకు బాగా తెలుసన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+