Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతి అసాధ్యం..! దేవతలెక్కడ ? బినామీలే- చంద్రబాబు మాజీ మిత్రుడి షాకింగ్..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. గతంలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రాజదాని పనులు నిలిచిపోవడంతో వాటిని ప్రధాని మోడీ సాయంతో తిరిగి ప్రారంభించడమే కాకుండా మూడేళ్లలోనే వీటిని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై మాజీ కేంద్రమంత్రి, ఒకప్పటి చంద్రబాబు మిత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి అంటున్నారని, తనకైతే దేవుడు కానీ, దేవతలు కానీ కనపడలేదని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తెలిపారు. అమరావతిలో అరటి చెట్లు, కర్ర తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాళహస్తిలో, కానిపాకంలో, తిరుపతి తిరుమల లో దేవుళ్ళు కనిపిస్తారని, అమరావతిలో ఏ దేవుడు కనిపిస్తాడో తనకు తెలియదన్నారు. 26 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 57 వేల కోట్ల రూపాయలు గ్యారెంటీతో అప్పు తెస్తోందని, తెచ్చిన 57 వేల కోట్ల రూపాయలు డబ్బంతా ఒక్క గుంటూరు జిల్లాలోని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

former union minister chinta mohan hot comments on Amaravati ask how can be god s capital

కృష్ణానది తీరంలో 50 అంతస్తుల భవనాలు కట్టడం ఎలా సాధ్యమని చింతా మోహన్ ప్రశ్నించారు. మూరెడు గొయ్యి తీస్తే నీళ్లు వస్తాయన్నారు. ముఖ్యమంత్రికి బంధుప్రీతి ఎక్కువని, మంత్రులు అమరావతి చుట్టూ బినామీ పేర్లతో 100, 200 ఎకరాలు భూములు కొన్నారని ఆరోపించారు. ఆ భూములకు విలువ పెంచేందుకు అమరావతి కట్టాలని సీఎం అనుకుంటున్నారని తెలిపారు. ఆస్ట్రేలియాలో, మలేషియాలో ముఖ్య పట్టణాలు కట్టాలని అనుకుని ఫెయిల్ అయ్యారని, అమరావతిలో కూడా ఒక ముఖ్య పట్టణాన్ని చంద్రబాబు కట్టలేడని, అది సాధ్యపడదని తన అనుమానం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లయ తప్పారని, దారి తప్పడని చింతా మోహన్ తెలిపారు.

ఈ మధ్యకాలంలో జీరో కరప్షన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, కానీ ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పంలో, పోలీస్ స్టేషన్లో, తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బు లేనిదే పనులు కావడం లేదని చింతా మోహన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 10 శాతం ఎమ్మెల్యేలు మినహా, మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు సంపాదనలో పడ్డారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, సూపర్ సిక్స్ అమలు కావడం లేదని తెలిపారు. మాటల ముఖ్యమంత్రే కానీ, చేతల ముఖ్యమంత్రి కాదన్నారు.

చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఒక ఇల్లు కట్టుకున్నారని, అమరావతిలో మరో ఇల్లు కట్టుకున్నారని, కుప్పంలో ఇంకో ఇల్లు కట్టుకున్నారని, తిరుపతిలో పేదలకు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే, వాటికి పసుపు రంగు వేయిస్తున్నారన్నారు.
అధికారులకు స్వేచ్ఛ లేదని, చిన్న అనుమతి ఇవ్వాలన్నా అమరావతి వైపు చూస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలకు మైక్ పెర్మిషన్ పోలీసులు ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ధంసమైందన్నారు.
మోడీ, చంద్రబాబు ఇద్దరూ యోగ కనిపెట్టినట్లు, ఇంకెవరు యోగా చేయనట్లు, యోగాకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇస్తున్నారన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ, మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చింతా మోహన్ ఆరోపించారు. రెండు రోజుల క్రితం కుప్పంలో ఒక వెనుకబడిన మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారని, చాలా దారుణమన్నారు.
అదే కుప్పం పట్టణంలో మరో ముస్లిం మహిళను కొట్టడం, తిట్టడం జరిగిందన్నారు. ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత కుప్పంలో నిరుపేద మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఎవరు కొట్టారు?? ఎందుకు కొట్టారు అనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దారుణ సంఘటనలో మహిళలపై జరగడం దుర్మార్గమన్నారు.

30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటని చింతా మోహన్ ప్రశ్నించారు. ఓబీసీలకు పెద్దపీట వేశామని అంటారని,. నలుగురికి పదవులు ఇస్తే బీసీలకు పెద్దపీట వేసినట్లా అని ప్రశ్నించారు. ఎంతమంది ఓబీసీలను కోటీశ్వరులను చేశారు?? ఒక్కరైనా ఉన్నారా?? ఉంటే చెప్పాలన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పేదరికం తగ్గించలేని వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని తీసేస్తానంటే ఎలా నమ్మాలన్నారు.

కుప్పంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీలను వర్గీకరణ చేశారని, సామాజిక న్యాయం గురించి అసెంబ్లీలో గొప్పగా ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. తెనాలిలో ఎస్సీ యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, సామాజిక న్యాయం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఎస్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అరకులో కన్నీరు సంపద కోసం కోటీశ్వరులు కన్నేశారని తెలిపారు. గిరిజనులను అక్కడి నుంచి తరిమేసేందుకు పురుషుల పురుషాంగాలను కోస్తున్నారన్నారు. మైనార్టీల వక్స్ బోర్డ్ బిల్లుకు పార్లమెంట్లో టిడిపి మద్దతు ఇచ్చిందన్నారు. ముస్లింల వ్యతిరేక చర్యకు పాల్పడిందన్నారు. ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణంపై కూటమి సర్కార్ వేగంగా అడుగులేస్తోంది. గతంలో వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రాజదాని పనులు నిలిచిపోవడంతో వాటిని ప్రధాని మోడీ సాయంతో తిరిగి ప్రారంభించడమే కాకుండా మూడేళ్లలోనే వీటిని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇలాంటి సమయంలో అమరావతి విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిపై మాజీ కేంద్రమంత్రి, ఒకప్పటి చంద్రబాబు మిత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి అంటున్నారని, తనకైతే దేవుడు కానీ, దేవతలు కానీ కనపడలేదని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తెలిపారు. అమరావతిలో అరటి చెట్లు, కర్ర తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయన్నారు. శ్రీకాళహస్తిలో, కానిపాకంలో, తిరుపతి తిరుమల లో దేవుళ్ళు కనిపిస్తారని, అమరావతిలో ఏ దేవుడు కనిపిస్తాడో తనకు తెలియదన్నారు. 26 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారని, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 57 వేల కోట్ల రూపాయలు గ్యారెంటీతో అప్పు తెస్తోందని, తెచ్చిన 57 వేల కోట్ల రూపాయలు డబ్బంతా ఒక్క గుంటూరు జిల్లాలోని ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

కృష్ణానది తీరంలో 50 అంతస్తుల భవనాలు కట్టడం ఎలా సాధ్యమని చింతా మోహన్ ప్రశ్నించారు. మూరెడు గొయ్యి తీస్తే నీళ్లు వస్తాయన్నారు. ముఖ్యమంత్రికి బంధుప్రీతి ఎక్కువని, మంత్రులు అమరావతి చుట్టూ బినామీ పేర్లతో 100, 200 ఎకరాలు భూములు కొన్నారని ఆరోపించారు. ఆ భూములకు విలువ పెంచేందుకు అమరావతి కట్టాలని సీఎం అనుకుంటున్నారని తెలిపారు. ఆస్ట్రేలియాలో, మలేషియాలో ముఖ్య పట్టణాలు కట్టాలని అనుకుని ఫెయిల్ అయ్యారని, అమరావతిలో కూడా ఒక ముఖ్య పట్టణాన్ని చంద్రబాబు కట్టలేడని, అది సాధ్యపడదని తన అనుమానం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు లయ తప్పారని, దారి తప్పడని చింతా మోహన్ తెలిపారు.

ఈ మధ్యకాలంలో జీరో కరప్షన్ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారని, కానీ ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పంలో, పోలీస్ స్టేషన్లో, తాసిల్దార్ ఆఫీస్ లో డబ్బు లేనిదే పనులు కావడం లేదని చింతా మోహన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 10 శాతం ఎమ్మెల్యేలు మినహా, మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు సంపాదనలో పడ్డారన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, సూపర్ సిక్స్ అమలు కావడం లేదని తెలిపారు. మాటల ముఖ్యమంత్రే కానీ, చేతల ముఖ్యమంత్రి కాదన్నారు.

చంద్రబాబు నాయుడు హైదరాబాదులో ఒక ఇల్లు కట్టుకున్నారని, అమరావతిలో మరో ఇల్లు కట్టుకున్నారని, కుప్పంలో ఇంకో ఇల్లు కట్టుకున్నారని, తిరుపతిలో పేదలకు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తే, వాటికి పసుపు రంగు వేయిస్తున్నారన్నారు.
అధికారులకు స్వేచ్ఛ లేదని, చిన్న అనుమతి ఇవ్వాలన్నా అమరావతి వైపు చూస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలకు మైక్ పెర్మిషన్ పోలీసులు ఇవ్వడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ధంసమైందన్నారు.
మోడీ, చంద్రబాబు ఇద్దరూ యోగ కనిపెట్టినట్లు, ఇంకెవరు యోగా చేయనట్లు, యోగాకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇస్తున్నారన్నారు.

కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ, మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చింతా మోహన్ ఆరోపించారు. రెండు రోజుల క్రితం కుప్పంలో ఒక వెనుకబడిన మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారని, చాలా దారుణమన్నారు.
అదే కుప్పం పట్టణంలో మరో ముస్లిం మహిళను కొట్టడం, తిట్టడం జరిగిందన్నారు. ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత కుప్పంలో నిరుపేద మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. ఎవరు కొట్టారు?? ఎందుకు కొట్టారు అనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో దారుణ సంఘటనలో మహిళలపై జరగడం దుర్మార్గమన్నారు.

30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా కుప్పం నియోజకవర్గానికి, చిత్తూరు జిల్లాకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటని చింతా మోహన్ ప్రశ్నించారు. ఓబీసీలకు పెద్దపీట వేశామని అంటారని,. నలుగురికి పదవులు ఇస్తే బీసీలకు పెద్దపీట వేసినట్లా అని ప్రశ్నించారు. ఎంతమంది ఓబీసీలను కోటీశ్వరులను చేశారు?? ఒక్కరైనా ఉన్నారా?? ఉంటే చెప్పాలన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో పేదరికం తగ్గించలేని వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో పేదరికాన్ని తీసేస్తానంటే ఎలా నమ్మాలన్నారు.

కుప్పంలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఎస్సీలను వర్గీకరణ చేశారని, సామాజిక న్యాయం గురించి అసెంబ్లీలో గొప్పగా ఉపన్యాసం ఇచ్చారని విమర్శించారు. తెనాలిలో ఎస్సీ యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, సామాజిక న్యాయం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఎస్టీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అరకులో కన్నీరు సంపద కోసం కోటీశ్వరులు కన్నేశారని తెలిపారు. గిరిజనులను అక్కడి నుంచి తరిమేసేందుకు పురుషుల పురుషాంగాలను కోస్తున్నారన్నారు. మైనార్టీల వక్స్ బోర్డ్ బిల్లుకు పార్లమెంట్లో టిడిపి మద్దతు ఇచ్చిందన్నారు. ముస్లింల వ్యతిరేక చర్యకు పాల్పడిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+