అప్పులపై మాట మార్చేసిన చంద్రబాబు-లెక్కలు తెలియని ఆర్ధికమంత్రులు-బుగ్గన ఫైర్..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై సీఎం చంద్రబాబు మాట మార్చేశారని మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గతంలో 14 లక్షల కోట్లని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు 9.56 లక్షల కోట్లని చెబుతున్నారని, అలాగే కార్పోరేషన్ల అప్పుల విషయంలోనూ తవ్వుతామంటూ బెదిరించడం ఎందుకు తవ్వితే తేలిపోతుందంటూ చంద్రబాబుకు బుగ్గన సవాల్ విసిరారు.

గతంలో బహిరంగ మార్కెట్లో ఎక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకున్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ వడ్డీకి అప్పులు చేసిందంటూ చేస్తున్న విమర్శల్ని బుగ్గన ఖండించారు. అసలు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడికి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కు లెక్కలు అర్ధం కావా అని బుగ్గన ప్రశ్నించారు. ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డీబీటీ) ద్వారా పథకాల సొమ్ము తాము పంచితే స్కాం అంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

former ysrcp minister buggana rajendranath condemns nda government propaganda over loans

మరోవైపు విద్యుత్ ట్రూఅప్ చార్జీల విషయంలోనూ ప్రభుత్వం విపక్షాలపై దుష్ప్రచారం చేస్తోందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఐదేళ్లో 20 వేల కోట్లకు పైగా ట్రూఅప్ ఛార్జీలు విధించారని, కానీ తాము వైసీపీ హయాంలో ఐదేళ్లలో కేవలం 2300 కోట్లు మాత్రమే ట్రూఅప్ ఛార్జీలు విధించినట్లు బుగ్గన చెప్పుకొచ్చారు. తాజాగా ఐదు నెలల్లోనే 6770 కోట్ల ట్రూఅప్ ఛార్జీలు విధించారంటూ ఎన్డీయే ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వ విమర్శల్ని ఆయన తప్పుబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+