పవన్ ప్రాసిక్యూషన్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు- చేతనైంది చేసుకోమని సవాల్...
ఏపీలో వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేసిన వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాసిక్యూషన్ కు వైసీపీ సర్కార్ ఇవాళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వాలంటీర్లపై వ్యాఖ్యలు చేసిన పవన్ తో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపైనా పరువునష్టం చర్యలు తీసుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇదే అంశంపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని స్పందించారు.
రాజకీయాల కోసం వాలంటీర్ల నైతిక స్ధైర్యం దెబ్బతినకూడదనే సంబంధిత శాఖాధిపతి(వాలంటీర్ల శాఖ హెచ్వోడీ) కోర్టుకు వెళ్తున్నట్లు బందరు ఎమ్మెల్యే పేర్నినాని వెల్లడించారు. పవన్ ను కొట్టే పని మాకేంటని ఆయన ప్రశ్నించారు. పవన్ మోడీ, అమిత్ షా, చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకుంటాదని, వాలంటీర్లపై ఆయన వ్యాఖ్యలు తప్పయితే న్యాయమూర్తి జైలుశిక్ష వేస్తాడు జాగ్రత్త అని పేర్ని హెచ్చరించారు.

సొల్లు మాటలు చెప్పడం పవన్ కు అలవాటని పేర్ని తెలిపారు. డేటా చౌర్యం అని పవన్ అంటున్నాడని, చంద్రబాబు పవన్ జంటగా నడిపిన ప్రభుత్వం సాధికారత సర్వేతో తీసిన డేటా ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. 2018లో రాష్ట్ర ప్రజల డేటా ఒక ప్రైవేట్ సంస్థ కు అమ్మితే పవన్ రంకెలు ఏమయ్యాయన్నారు. బాబు, పవన్, బీజేపీ కలిసి చేతనైంది చేసుకోవాలని పేర్ని సవాల్ విసిరారు. సై అంటే సై పవన్ అన్నారు.
ఇంటర్నెట్ లో జనసేన సభ్యత్వం కావాలంటే వ్యక్తిగత వివరాలు ఇవ్వాలిని, ఇది డేటా కదా, ఎందుకు తీసుకుంటున్నారని, ఎవరికి ఇస్తున్నారని పేర్నినాని ప్రశ్నించారు. జనాభా లెక్కలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం నీ మోడీ, మీ అమిత్ షా ఏం అడుగుతారో తెల్సా పవన్ అని నిలదీశారు. అమిత్ షాతో మోడీతో నీకు బంధం ఉంటే నీకు చేతనయినది చేసుకో పవన్ అన్నారు.
చంద్రబాబు కోసం బతికే తప్పుడు ఆలోచనలు మానుకో పవన్ అన్నారు. నువ్వు అమిత్ షా, మోడీతో మాట్లాడితే ఏమవుతుంది పవన్ అని పేర్ని ప్రశ్నించారు. కేంద్రంలోనూ వాలంటీర్లు ఉన్నారని, నేషనల్ యూత్ వాలంటీర్లు నెలకు 8 వేల జీతం తీసుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications