ఐదు నెలల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన వైసీపీ నేత
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు ఎట్టకేలకు బెయిల్ లభించింది. సుదీర్ఘ కాలం జైల్లో ఉన్న నందిగం సురేష్‌కు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. అయితే బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. దీంతో నందిగం సురేష్ మరోసారి దిగివకోర్టులో బెయిల్ దాఖలు చేసుకున్నారు. చివరికి ఆయన ప్రయత్నాలు ఫలించి బెయిల్ లభించింది.
తుళ్లూరు మండలం వెలగపూడికి ఎస్సీ మహిళ మరియమ్మ వైసీపీ ప్రభుత్వ హాయాంలో పింఛన్ సరిగ్గా రావడం లేదని జగన్ సర్కార్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన అప్పటి ఎంపీ నందిగాం సురేష్ అనుచురులు మరియమ్మ ఇంటిపై దాడి చేయగా.. ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై 2020లో తుళ్లూరు పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. అయితే, వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు ఈ కేసును పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు చేసిన పలు వ్యవహారాలపై కేసులు నమోదు చేశారు. టీడీసీ కేంద్ర కార్యాలయం పడి దాడి కేసులో నందిగం సురేశ్‌ని అరెస్టు చేశాక ఆయనకి బెయిల్ వచ్చింది. వెంటనే దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సురేష్‌ను మరోసారి అరెస్ట్ చేశారు.ఈ కేసులో బెయిల్ బెయిల్ కోసం సురేశ్ తొలుత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ నిరాకరించింది.
హైకోర్టు తీర్పును ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో నందిగాం సురేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉన్న సురేష్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. సుప్రీం కోర్టును ఆశ్రయించనా ఊరట దక్కలేదు. చివరకు మంగళగిరి కోర్టు సురేష్‌కు ఈ కేసులో బెయిల్ ఇచ్చింది.మంగళగిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల పూచీకత్తు సమర్పించాలని సురేష్‌ను ఆదేశించింది కోర్టు. అలాగే.. కేసు విచారణకు సహకరించాలని.. పోలీసులు పిలిచినప్పుడు దర్యాప్తుకు వెళ్లాలని నందిగం సురేష్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications