PVP: బీజేపీలోకి వైసీపీ నేత పీవీపీ ? విపక్ష కూటమిని ఆకాశానికెత్తేస్తూ..!

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా రాజకీయ నేతల విధేయతలు ఎప్పుడెలా మారతాయో తెలియడం లేదు. గతంలో ఓ రాజకీయ పార్టీలో ఉన్న వారు ఈసారి ఎన్నికల నేపథ్యంలో మారుతున్న సమీకరణాలతో తమ వ్యూహాలు కూడా మార్చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పుల తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీడీపీ, జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు ఓ వైసీపీ కీలక నేత బీజేపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైన పొట్లూరి వీర ప్రసాద్ (పీవీపీ) కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగే జగన్ ప్రభుత్వ విధానాలను విమర్శించకపోయినా ప్రత్యర్ధి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుగా నిలుస్తున్నారు. అందులోనూ బీజేపీ అన్నా, నరేంద్ర మోడీ విధానాలకు మద్దతుగా ఎక్స్ లో పలు ట్వీట్లు పెడుతున్నారు.

former ysrcp vijayawada mp contestant pvp likely to join bjp soon

ఇదే క్రమంలో ఇవాళ కూడా పీవీపీ మరో ట్వీట్ పెట్టారు. తాజాగా టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో పీవీపీ చేసిన ఈ ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఆకాశానికెత్తేస్తూ వీరంతా కలిసి ఏపీని రక్షించాలని ఆకాంక్షిస్తూ పీవీపీ ట్వీట్ చేశారు. చివర్లో ఉందిలే మంచీ కాలం ముందూ ముందునా అంటూ కొటేషన్ కూడా పెట్టారు పీవీపీ.

దీంతో పీవీపీ త్వరలోనే బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరికి టీడీపీ, జనసేనకు మద్దతుగా నిలిచేందుకు, వీలైతే తీరిగి ఎంపీగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు బీజేపీ కూడా ఈసారి దాదాపు ఆరు సీట్లలో పోటీకి గట్టి అభ్యర్ధుల కోసం వెతుకుతోంది. ఈ సమయంలో పీవీపీ పేరు పరిశీలనకు వచ్చినా ఆశ్చర్యం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+