Rajya Sabha: ఏపీలో నాలుగు రాజ్యసభ బెర్తులు ఫిక్స్? అనూహ్య ఎంపిక..!
ఏపీలో నాలుగు రాజ్యసభ (rajya sabha) సభ్యుల పదవీకాలం ఈ ఏడాదిలో ముగియనుంది. అయితే ఇందులో ముగ్గురి పదవీకాలం జూన్ లోనూ, మరో సభ్యుడి పదవీకాలం డిసెంబర్ లోనూ ముగియబోతోంది. దీంతో వీరి స్ధానాల్లో కొత్త వారి ఎంపిక కోసం ఎన్డీయే కసరత్తు చేస్తోంది. వీటి వివరాలను ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారని పేరున్న సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..
ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ, ఎస్ నిరంజన్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ లో ముగియబోతోంది. వీరంతా వైసీపీ సభ్యులే. మరో సభ్యుడు సానా సతీష్ బాబు (టీడీపీ) పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ లో ముగియనుంది. దీంతో ఈ నాలుగు సీట్లకూ అభ్యర్ధులు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మంత్రి నారా లోకేష్ కు సన్నిహితుడిగా పేరున్న సానా సతీష్ బాబుకు మాత్రం ఈసారి పొడిగింపు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనకు గతంలో పూర్తి సమయం ఎంపీగా ఛాన్స్ దక్కకపోవడంతో ఈసారి పొడిగింపు ఇస్తారని సమాచారం.

ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా (4) వీరికి అవకాశం ఉండొచ్చు!
— Praveen Pullata (@praveenpullata) February 9, 2026
టీడీపీ - సానా సతీశ్ బాబు కొనసాగింపు
టీడీపీ - భాష్యం రామకృష్ణ / ?
జనసేన - LEP రమేష్ బాబు
బీజేపీ - అన్నామలై
బీజేపీ ఒత్తిడి చేస్తే చివరి నిమిషంలో మార్పులకు అవకాశం!
అలాగే మిగిలిన మూడు సీట్లను టీడీపీ, జనసేన, బీజేపీ పంచుకోబోతున్నట్లు సర్వేయర్ ప్రవీణ్ పుల్లట తెలిపారు. ఇందులో టీడీపీ నుంచి భాష్యం రామకృష్ణ, జనసేన కోటాలో లింగమేనని రమేశ్ బాబు, బీజేపీ నుంచి మాజీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. చివరి నిమిషంలో బీజేపీ ఏదైనా ఒత్తిడి చేస్తే తప్ప ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లేనని ప్రవీణ్ పుల్లట నిన్న ట్వీట్ చేశారు. దీంతో ఈ పేర్లు దాదాపు ఖరారైనట్లే అనుకోవచ్చు.












Click it and Unblock the Notifications