జగన్ సర్కార్ కు కేంద్రం ఝలక్-4 స్మార్ట్ సిటీ కార్పోరేషన్ ఛైర్మన్ల రాజీనామా-వెంటనే ఆమోదం

ఏపీలో ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ కార్పోరేషన్లు, వాటి ఛైర్మన్ల వ్యవహారం వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా వైసీపీ ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసినట్లు విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నామినేషన్ పోస్టుల భర్తీలో భాగంగా నాలుగు విశాఖ, కాకినాడ, ఏలూరు, తిరుపతికి స్మార్ట్ సిటీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. వీటికి వైసీపీ నేతల్ని ఛైర్మన్లుగా నియమించారు. అయితే వీరి విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు వారిని తమ పదవులకు రాజీనామాలు చేయాల్సిందిగా ప్రభుత్వం కోరినట్లు సమాచారం. దీంతో వారంతా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. వీటిని వెంటనే ప్రభుత్వం ఆమోదించింది.

four smart city corporations chairmans resigned in ap with centres objections

గతంలో కేంద్ర ప్రభుత్వం కాకినాడ, తిరుపతిని స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత మరో రెండు సిటీల్ని స్మార్ట్ సిటీలుగా గుర్తిస్తూ వాటి కార్పోరేషన్లకు ఛైర్మన్లను సైతం ప్రకటించింది. అయితే వీటికి న్యాయపరంగా అభ్యంతరాలు ఉండటంతో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకూడదనే ప్రభుత్వం వారితో రాజీనామాలు చేయించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సదరు కార్పోరేషన్ల ఛైర్మన్ల పదవులు మాత్రం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+