ఉచిత బస్సుకు పరిహారంగా 25 వేలు..! విజయవాడ ఆటో డ్రైవర్ల డిమాండ్..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది. అయితే దీని వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కూడా అదే రోజు సాయం ప్రకటిస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఇప్పటివరకూ దీనిపై మాట్లాడటం లేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆటో డ్రైవర్లు రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళలకు దిగుతున్నారు. అలాగే ప్రభుత్వం ముందు పరిహారంతో పాటు కీలక డిమాండ్లు పెడుతున్నారు.
మహిళలకు ఉచిత బస్సు సందర్భంగా నష్టపోయిన ఆటో,క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం 25,000 ప్రకటించాలని కోరుతూ ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావుకు సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ వినతిపత్రం ఇచ్చింది. సిఐటియు ఆధ్వర్యంలో సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిన ఆటో డ్రైవర్లు మెమోరాండం సమర్పించారు.

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆగస్టు 15,నుండి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఆహ్వానిస్తున్నామని, అయితే దీని వల్ల నష్టపోతున్న ఆటో,క్యాబ్ డ్రైవర్లకు నష్టపరిహారం ప్రకటించకపోవడంతో నిరాశకు గురవుతున్నట్లు వారు తెలిపారు. 10 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉచిత బస్సు ప్రారంభం రోజే ఆటో క్యాబ్ డ్రైవర్లకు ఆర్థిక సహాయం ప్రకటిస్తానని చెప్పి ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. కాబట్టి కనుక ప్రభుత్వం ద్వారా వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని దీనితోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో, మోటార్ కార్మికులను ఆదుకునేందుకు చేసిన వాగ్దానాలు అమలు చేయాలని కోరుతున్నారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బోండా ఉమ.. సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, వెంటనే తన వంతు తప్పనిసరిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం దృష్టికి సమస్యను తీసుకువెళ్తానని తెలిపారు. ఆటోడ్రైవర్ల డిమాండ్లలో ఏడాదికి 25 వేల పరిహారంతో పాటు వేల రూపాయలు జరిమానాలు విధించే జీవో నెంబర్ 21.రద్దు చేయాలని, సాధికారిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటోలు కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంకుల ద్వారా 4 లక్షల రూపాయలు సబ్సిడీతో రుణాలు ఇవ్వాలని, మోటార్ వాహనాలకు బ్రేక్ చేసే పద్ధతి (ఫిట్నెస్) ప్రభుత్వ ఆధీనంలో నడపాలని, ఓలా,ఊబర్,ర్యాపిడో యాప్స్ రద్దుచేసి కేరళలా రాష్ట్రమే ఉచిత యాప్ తయారు చేయాలని, సీఎన్జీ గ్యాస్ స్పేర్ పార్ట్స్ ధరలు తగ్గించాలని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications