ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్లు అప్పటి నుంచే-షరతులివే-మంత్రి ప్రకటన..!
ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకం అమలుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. వీటి వివరాలను ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ వెల్లడించారు. ఇందులో పథకం అమలు తేదీ, ఎవరెవరికి ఇస్తారు, షరతులేంటి అన్న అంశాలు ఉన్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నట్లు అవుతుందని మంత్రి తెలిపారు.

ఈ ఏడాది దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ఏపీలో అమలు చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ఇవాళ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. కూటమి పార్టీల ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ లో 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఒకటి అని, ఈ పథకం కింద లబ్దిదారులకు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారని ఆయన వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల ఉచితంగా అందిస్తామని మంత్రి తెలిపారు.
అలాగే మహిళల కోసం ఇచ్చే ఉచిత గ్యాస్ సిలెండర్లకు ప్రభుత్వంపై ఏడాదికి మూడు వేల కోట్ల రూపాయలు భారం పడనుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. వచ్చే క్యాబినెట్ లో ఈ పథకానికి అనుమతి తీసుకుంటామని తెలిపారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా గ్యాస్ సిలెండర్ల పంపిణీ ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications