అమరావతి జనానికి.. అవన్నీ ఉచితమే అంటున్న సర్కార్
విజయవాడ : రాష్ట్రాభివృద్దికి రాష్ట్రానికి కేంద్రబిందువుగా ఉండే రాజధాని కోసం భూములను త్యాగాలు చేసిన రైతులను ఆదుకోవాలని యోచిస్తోంది ఏపీ సర్కార్. ఇందుకోసం భారీ సంక్షేమ పథకాలను అక్కడి గ్రామాల ప్రజల కోసం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా తయారు చేసిన అధికారులు.. ఉచిత విద్యా, వైద్యా, ఉపాధి శిక్షణ వంటి కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టబోతున్నట్టుగా సమాచారం. ప్రభుత్వ ఆదేశాల మేరకు 34 వేల ఎకరాలను త్యాగం చేసిన 29 గ్రామాల ప్రజలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

ఈ నేపథ్యంలోనే.. సీఎం ఆదేశాల మేరకు కసరత్తులు చేసిన అధికారులు ఈ ఏడాది నుంచే ఆయా పథకాల అమలుకు సిద్దమవుతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత విద్యలో భాగంగా.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీతో పాటు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి కోర్సులను ఆ 29 గ్రామాల ప్రజలకు ఉచితంగా అందించనున్నారు.
అలాగే ఇప్పటికే మొదలైన ఉచిత వైద్య శిబిరాలతో పాటు కార్పోరేటు వైద్యాన్ని కూడా అక్కడి ప్రజలకు అందించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం. అలాగే రోడ్లు, ఎల్ఈడీ విద్యుత్ దీపాలు, డ్రైనేజి వంటి మౌళిక సదుపాయాలు కూడా కల్పించాలని చూస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం సీఆర్డీఏ ఇప్పటికే ప్రణాళికలు కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం.












Click it and Unblock the Notifications