పదేళ్ల పాటు ఉచితంగా: అమరావతిలో చంద్రబాబు బహుమతి
విజయవాడ: అమరావతి ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్యా సౌకర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించనుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు ఉచిత విద్యను అమలు చేస్తూ సోమవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌లు, వృత్తివిద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఈ ఉచిత విద్యను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
2014 డిసెంబర్ 8 నాటికి, రాజధాని ప్రాంతంలో ఉన్న వారికి పదేళ్ల పాటు విద్యను ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం, గుర్తింపు పొందిన వృత్తి, విద్యా కళాశాలల్లో ట్యూషన్ ఫీజు, ఫీజు రీయింబర్సుమెంట్స్, తదితర సౌకర్యాలు ప్రభుత్వం భరించనుంది.












Click it and Unblock the Notifications