విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భార్యతో అఫైర్ అనుమానం: జెమినీ విలేకరి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

 Friend kills Jemini journalist suspecting infedility
విశాఖపట్నం: గత నెల 26వ తేదీన విశాఖపట్నం జిల్లాలో జరిగిన జెమినీ విలేకరి జగదీష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య కేసులో కాంట్రాక్టర్, జగదీష్ మిత్రుడు శ్యాంమోహన్ రావును ప్రధాన నిందితుడిగా విశాఖపట్నం జిల్లా పిఎం పాలెం పోలీసులు గుర్తించారు.

కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి - గాజువాక శ్రీహరినగర్‌కు చెందిన శ్యాంమోహన్ రావు, జగదీష్ మిత్రులు. దాంతో జగదీష్ శ్యాంమోహన్ రావు ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఆయన భార్యతో మాట్లాడుతూ ఉండేవాడు. దానివల్ల శ్యాంమోహన్ రావుకు భార్యపై అనుమానం పెరిగింది. భార్యను ఈ విషయంపై మందలించాడు కూడా.

భర్త మందలింపుతో మనస్తాపానికి గురైన శ్యాంమోహన్ రావు భార్య జార్ఖండ్‌లోని పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడ ఈ ఏడాది మే 14వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. తన భార్య ఆత్మహత్యకు జగదీష్ కారణమని శ్యాంమోహన్ రావు కక్ష పెంచుకున్నాడు. అతన్ని చంపేందుకు పథకం వేశాడు.

బయటకు వెళ్దాం రమ్మని పిలిచి గత నెల 26వ తేదీన జగదీష్‌వప సాగర్ నగర్ ఏరియా గుడ్లవానిపాలెం తీసుకుని వెళ్లి హత్య చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు అసలు విషయం వెలికి తీశారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, సోమవారం కోర్టులో ప్రవేశపెట్టారు. శ్యాంమోహన్ రావుకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ఆయనను జైలుకు తరలించారు.

English summary
Contractor Shyammohan Rao has been arrested in Jemini journalist Jagadeesh murder case in Visakhapatnam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X