చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా .. ప్లాన్ ప్రకారమే జగన్ పై కుట్ర చేస్తున్నారన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులు ఆ తరువాత రాష్ట్రంలో పరిణామాలు ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. వైసిపి గుండాలు టిడిపి కార్యాలయాలపై దాడులు చేశారని రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటే, ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చంద్రబాబు చేయిస్తున్నాడని, వాళ్ళకే వాళ్ళే దాడులు చేయించుకుని వైసీపీపై బురద చల్లుతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.

పట్టాభి వ్యాఖ్యలు చంద్రబాబు కుట్రలో భాగమే

పట్టాభి వ్యాఖ్యలు చంద్రబాబు కుట్రలో భాగమే

తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ ఉనికిని కోల్పోయిందని, అందుకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతోందని గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే అంతా జరిగిందని, ముఖ్యమంత్రి పై కుట్ర ప్రకారమే పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించారని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీలో హుందాతనం కరువైందని ఆయన నిప్పులు చెరిగారు.

టీడీపీది వికృత క్రీడ ... అందుకే అలా నీచాతినీచంగా

టీడీపీది వికృత క్రీడ ... అందుకే అలా నీచాతినీచంగా

ముఖ్యమంత్రిపై కుట్రలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయొచ్చు కానీ, ఈ రకమైన కుట్రలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. టిడిపి నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలు గమనించాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ప్లాన్ ప్రకారమే రెచ్చగొడుతున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. తెలుగుదేశం పార్టీది వికృత క్రీడ అని అభివర్ణించిన శ్రీకాంత్ రెడ్డి పట్టాభితో నీచాతి నీచంగా మాట్లాడించి, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది చంద్రబాబేనని మండిపడ్డారు.

పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డి పై వాడిన పదాలకు అర్ధం ఏమిటో?

పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డి పై వాడిన పదాలకు అర్ధం ఏమిటో?


చంద్రబాబు ఆకస్మికంగా ఏపీకి ఎందుకు వచ్చారో ఇప్పుడు అర్థమవుతుందన్నారు. చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందని మండిపడ్డారు. పట్టాభి సీఎం జగన్మోహన్ రెడ్డి పై వాడిన పదాలకు అర్ధం ఏమిటో తెలుసా అంటూ నిప్పులు చెరిగారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. రెండున్నర సంవత్సరాలలో జగన్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించారని, రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, అది చూసి ఓర్చుకోలేక చంద్రబాబు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎవరినడిగినా టీడీపీ నేతలు వెన్నుపోటు దారులని, కుట్రలు చేశారని చెప్పారన్నారు.

సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలన్న శ్రీకాంత్ రెడ్డి

సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలన్న శ్రీకాంత్ రెడ్డి

చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎంత రెచ్చగొట్టినా వైసిపి కార్యకర్తలు సంయమనం పాటించాలని సీఎం జగన్ ఆదేశించారని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పబ్లిసిటీ కోసం చంద్రబాబు దేనికైనా తెగిస్తారు అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు నోటికి వచ్చినట్టుగా అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలకు తెలుగుదేశం పార్టీ కారణం అంటూ పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ పనిచేస్తున్నారని గడికోట శ్రీకాంత్ రెడ్డి కితాబిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రగడకు చంద్రబాబే కారణం అంటూ తేల్చి చెప్పారు గడికోట శ్రీకాంత్ రెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+