వివేకా హత్యపై అసెంబ్లీలో చర్చకు మేం రెడీ; టీడీపీ అసెంబ్లీలో మాట్లాడాలి: గడికోట శ్రీకాంత్ రెడ్డి
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక టీడీపీ జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేస్తోందని, వ్యక్తిత్వ హననం చేస్తోందని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

వివేకానంద రెడ్డి హత్య పై అసెంబ్లీ లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాం
తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య పై అసెంబ్లీ లో చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రజా సమస్యలను అత్యంత ప్రాధాన్యం ఉన్న అంశాలు గా పరిగణించి సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

గత ప్రభుత్వం టీడీపీలా కాకుండా ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నాం
ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. గత ప్రభుత్వం టీడీపీలా కాకుండా ప్రస్తుతం తాము ప్రతిపక్షాన్ని గౌరవిస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల పేరు తెచ్చి శాసనసభ సమావేశాల నుండి వెళ్లిపోయారని విమర్శించిన శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి హాజరుకావాలని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండి రాజకీయాలు చేయాలని చూడడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ వివేకా హత్యపై టీడీపీ మాట్లాడేది అసెంబ్లీలో మాట్లాడాలి
తెలుగుదేశం పార్టీ బయట మాట్లాడుతున్న అన్నిటిని అసెంబ్లీలో మాట్లాడాలని గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్యను టిడిపి నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్య పై తప్పుడు రాతలు రాయిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద రెడ్డి హత్య పై అసెంబ్లీలో చర్చ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.

అసెంబ్లీకి ఉన్న హక్కులపైనా చర్చించాలని భావిస్తున్నాం
ఇదే సమయంలో అసెంబ్లీకి ఉన్న హక్కులపై చర్చించాలని భావిస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.అసెంబ్లీ అధికారాలపై సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారని, దీనిపై బీఏసీలో చర్చించాలని కోరతామని గడికోట శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తెలుగుదేశం పార్టీ మళ్లీ మనసు మార్చుకున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య రచ్చ ఏ విధంగా ఉంటుంది అనేది ఆసక్తికర అంశం.
-
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications