జగన్ కోసమే: చిరు జట్టుపై గాలి, భయం: సోమిరెడ్డి

 Gali fires at Chiru team bus yatra
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసమే కాంగ్రెసు పార్టీ నాయకులు బస్సు యాత్ర నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. చిరంజీవి, రఘువీరా రెడ్డి తదితర కాంగ్రెసు నాయకులు సీమాంధ్రలో చేపట్టిన బస్సు యాత్రపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నాయకులు చేయాల్సింది బస్సు యాత్ర కాదని, సోనియా ఇంటి నుంచి కాశీయాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత సోనియా కుటుంబంతో సహా ఇంటికి వెళ్లిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసుకు ప్రజలు శవయాత్ర నిర్వహిస్తారని ఆయన అన్నారు.

కేసులకు భయపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సిపిఎంతో పొత్తుకు దూరమయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తృతీయ కూటమి అధికారంలోకి రాదని తెలిసి సిపిఎంతో పొత్తుకు దూరమయ్యారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తృతీయ ఫ్రంట్ నుంచి ఎందుకు వైయస్సార్ కాంగ్రెసు తప్పుకుందో చెప్పాలని ఆయన జగన్‌ను డిమాండ్ చేశారు.

తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు వైయస్సార్ కాంగ్రెసుకు లేదని ఆయన అ్నారు. శిక్షను తప్పించుకునేందుకే జగన్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఒప్పందం చేసుకున్నారని ఆయన విమర్శించారు. అందుకే సిబిఐ జెడి లక్ష్మీనారాయణకు పోస్టింగు ఇవ్వకుండా చాలా కాలం ఆపారని ఆయన అన్నారు.

సోనియా దయాదాక్షిణ్యాలతోనే జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు. సిబిఐ కేసులు, జైలు రికార్డే వైయస్సార్ కాగ్రెసు పునాది అని విమర్శించారు. ఢిల్లీలో రహస్య మంతనాలు జరిపే వైయస్సార్ కాంగ్రెసు నేతలకు నేతలకు తమ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదని హెచ్చరించారు.

జగన్, కెసిఆర్ మాట విని కాంగ్రెస్ భూస్థాపితం అయిందన్నారు. తాము రైతు రుణ మాఫీ అంటే జగన్‌కు ఎందుకంత బాధ అని ఆయన ప్రశ్నించారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఆపాలని కోర్టుల్లో జగన్ పిటిషన్లు వేశారని, జగన్‌కు ఓటమి భయమనడానికి ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. విలువల గురించి జగన్ మాట్లాడితే విలువలు పాటించే వారు ఆత్మహత్య చేసుకుంటారని సోమిరెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+