వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కాళ్లు పట్టుకుంటారో, ఇంకేదైనా చేస్తారో: హోదాపై గాలి తీవ్ర వ్యాఖ్యలు

ప్రత్యేక హోదా అంశం స్పందించిన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై స్పందించిన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జల్లికట్టుకు, ప్రత్యేక హోదాకు ముడిపెడుతూ కొందరు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన
మండిపడ్డారు.

ప్రతీ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధాలు చేసుకోలేవని అన్నారు. ప్రత్యేక హోదా వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ అనలేదని... ప్రధాని మోడీకి ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు మొదటి డిమాండ్ అదేనని తెలిపారు.

 Gali Muddu krishnama naidu fires at Venkaiah and arun jaitley for special status

ప్రత్యేక హోదా సమస్యకు కారణం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలే అని అన్నారు. ఇప్పుడు వారిద్దరూ మోడీకి కుడి, ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మోడీ కాళ్లు పట్టుకుంటారో, ఇంకేదైనా చేస్తారో... ప్రత్యేక హోదా తీసుకురావాల్సింది వారిద్దరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మార్చిలో బడ్జెట్ సమావేశాలు

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను మార్చిలో నిర్వహించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. బడ్జెట్ ముందస్తు ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా యనమల మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరిలో ఉన్నందు వల్ల వాస్తవిక బడ్జెట్ ను రూపొందిస్తున్నామని, ఖర్చుల ఆధారంగా ఆయా శాఖలకు నిధులను కేటాయించనున్నామని చెప్పారు. రెవెన్యూలోటు రూ.4 వేల కోట్లుగా ఉందని, మూడేళ్లలో రెవెన్యూ లోటును సున్నకు తీసుకువస్తామని యనమల తెలిపారు.

English summary
Telugudesam MLC Gali Muddu krishnama naidu on Monday fired at Union Ministers Venkaiah and arun jaitley for special status of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X