పొమ్మనలేక పొగ: వెంకయ్య నాయుడిపై నిప్పులు చెరిగిన గాలి

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్ర మంత్రి, బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు నిప్పులు చెరిగారు. పొమ్మనలేక పొగ పెడుతున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో బిజెపి నేతలపై విరుచుకుపడ్డారు.

ఎన్డీయె నుంచి వెళ్లిపోవాలని చెప్తే తాము పోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. ఎపికి ప్రత్యేక నిధులు ఏమీ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం కోసం మాత్రం రూ.350 కోట్లు ఇచ్చారని ఆయన చెప్పారు. ఇలా అయితే రాజధాని నిర్మాణం ఎన్నేళ్లు పడుతుందో తెలియదని ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు.

 Gali Mudduma lashes out at Venakaiah Naidu

ప్రత్యేక హోదా విషయంలో ప్రదాని నరేంద్ర మోడీపై, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో శ్రీవారి పాదాల సాక్షిగా ప్రత్యేక హోదాకు మోడీ, చంద్రబాబు హామీ ఇచ్చారని ఆయనయ శనివారం మీడియా సమావేశంలో గుర్తు చేశారు.

ఆ హామీని వారు ఇప్పుడు తుంగలో తొక్కారని వ్యాఖ్యానించారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని బిజెపి, టిడిపి కలిసి మంటగలిపాయని ఆయన అన్నారు మోడీ, చంద్రబాబు దొంగ నాటకాలాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లారని ఆయన చెప్పారు.

ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా తమ పార్టీ ఆగస్టు 2వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ బంద్‌కు అన్ని వర్గాలూ సహకరించాలని ఆయన కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam party (TDP) MLC Gali Muddukrishnama Naidu lashed out at Venakaih Naidu on special category status to Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి