పయ్యావుల విభజన ఎపిసోడ్: ఎర్రబెల్లికి గాలి కౌంటర్

పయ్యావుల కేశవ్ ఏం తప్పు చేశారని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనిగాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రశ్నించారు. పయ్యావులపై గురువారం ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పందించారు. ప్రజల ఎజెండానే పయ్యావుల మాట్లాడుతున్నారని మద్దతుగా మాట్లాడారు.
అఖిలపక్షానికి ఆహ్వానంపై తమకు ఇంకా లేఖ అందలేదని, అందిన తర్వాత పార్టీలో చర్చించి అఖిలపక్ష భేటీపై వెల్లడానికి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని ముద్దు కృష్ణమ చెప్పారు. 2014 ఎన్నికల్లో ప్రజల తీర్పు తర్వాతే విభజనై అడుగు ముందుకు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ వైఖరితో విభేదించలేదు
తెలుగుదేశం పార్టీ వైఖరికి భిన్నంగా ప్రవర్తించలేదని, విభజనపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆ పార్టీ నేత ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానో పార్టీ అధినాయకత్వానికి వివరించానని అన్నారు.
తెలుగుదేశం పార్టీ విధానానికి భిన్నంగా తన పిటిషన్ లేదని పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరిని సస్పెండ్ చెయ్యాలన్న పార్టీదే నిర్ణయమని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పయ్యావుల స్పష్టం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications